end
=
Saturday, November 9, 2024
వార్తలురాష్ట్రీయంధరణి పోర్టల్ షురూ..
- Advertisment -

ధరణి పోర్టల్ షురూ..

- Advertisment -
- Advertisment -
  • ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

బీఎస్పీ సంచలన నిర్ణయం..

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ ఇవాళ షురూ అయింది. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి వెబ్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. నవంబర్ 2వ తేదీ నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు వెంటనే పూర్తయ్యేలా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. రెవెన్యూ డిపార్టుమెంట్‌లో దీన్నొక నవశకంగా భావించవచ్చు.

రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

రెవెన్యూ విధానంలో పూర్తి పారదర్శకత ఉండాలని, ఎక్కడ అవినీతి ఉండవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరంగా, పారదర్శంగా ఉండే విధంగా ఆన్ లైన్ చేశారు.ఇక మీదట తెలంగాణలో వ్యవసాయ భూములన్నీ ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌‌తోపాటు మ్యుటేషన్ కూడా జరిగే విధంగా ధరణి వెబ్ సైట్లో మార్పులు చేశారు.

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌: ప్రధాని

ఎమ్మార్వో ఆఫీసులో 15 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 570 ఎమ్మార్వో కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే.. ఇకపై భూమిని విక్రయించేవారు, కొనుగోలు చేసేవారు ఇద్దరూ తహసీల్దార్‌ ఎదుట హాజరు కావాల్సిందే. ఇప్పటిదాకా సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూమిని కొనుగోలు చేసేవారు లేకున్నా తన ప్రతినిధి (రిప్రజెంటేటివ్‌)ను పంపిస్తే రిజిస్ట్రేషన్‌ జరిగేది.

ఆ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కే్ లేదు

ఇకపై అలా సాధ్యంకాదు. అంతే కాకుండా భూములు కలిగినవారు ఎవరికైనా జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) లేదా స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(ఎస్‌పీఏ) ఇస్తే.. యజమానుల తరఫున వీరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి.. రిజిస్ట్రేషన్‌ చేయించడాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

గ్రామాల ఆభివృద్ధే లక్ష్యం…ఎమ్మెల్యే ఆరూరి

హైదరాబాద్‌, పట్టణ ప్రాంతాలు మినహా గ్రామీణ ప్రాంతాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా ధరణి పోర్టల్‌ ప్రారంభం కానుండటంతో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక్కో తహసీల్దార్‌ కార్యాలయానికి ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది.

బ్యాంకు దొంగల అరెస్ట్‌..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -