టీఆఎర్‌ఎస్ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా పండుగ రోజు ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలనుకున్నప్పటికీ అది వాయిదా పడింది. మొత్తానికి ఈ నెల 29న ధరణి పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఈ విషయం రాష్ట్రంలోని రైతులందరికీ శుభవార్త.
Nokia 215 4G, 225 4G VoLTE మొబైల్స్ విడుదల
విజయవంతమైన పోర్టల్ ట్రయల్స్
రెవెన్యూ సంస్కరణల్లో విప్లవాత్మకమైన ‘ధరణి’ పోర్టల్.. భూమి రిజిస్ట్రేషన్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నది. రాష్ట్రంలోని 570 మండలాల్లో తాసిల్దార్లు ఒక్కో మండలంలో 10 దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వస్తే సరిచేయాలని అధికారులు భావించారు. కానీ, ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదని, అన్ని మండలాల్లో ట్రయల్స్ విజయవంతంగా అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. దీంతో పూర్తిస్థాయి కార్యాచరణ అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ధరణి పోర్టల్‌పై తహసిల్దార్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ధరణిలో రిజిస్ట్రేషన్ల విధానం చాలా బాగుంది. సులువుగా క్రయవిక్రయాల నమోదు జరుగుతున్నది’ అని పేర్కొన్నారు. పోర్టల్ చాలా బాగుందని కితాబిచ్చారు. శనివారం నాటి వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎస్.. ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లు, నయాబ్ తాసిల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండున్నర గంటలపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించారు. తాసిల్దార్లకు ఎంతవరకు అవగాహన వచ్చిందో తెలుసుకోవడానికి మండలానికి 10 చొప్పున ట్రయల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాసిల్దార్లు చేపట్టిన ట్రయల్స్ విజయవంతం అయ్యాయి.
ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..