end
=
Thursday, January 23, 2025
క్రీడలుDhoni:‘మిస్టర్ కూల్’ రహస్యం చెప్పేసిన ధోని
- Advertisment -

Dhoni:‘మిస్టర్ కూల్’ రహస్యం చెప్పేసిన ధోని

- Advertisment -
- Advertisment -
  • మైదానంలో ఎప్పుడూ కోపం తెచ్చుకోనని వెల్లడి
  • ప్లేయర్లపై నెగిటివ్ ఇంప్యాక్ట్ పడకుండ చూసేందుకే
  • ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పిన ఎంఎస్‌డీ

టీమ్ ఇండియా మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Ms Dhoni) గ్రౌండ్‌లో మౌనంగా ఉండటానికి కారణాలేంటో వెల్లడించాడు. మ్యాచ్ (Match) జరుగుతున్న సమయంలో టీవీల్లో తమను కొన్ని కోట్ల మంది గమనిస్తుంటారని, అప్పుడు కోపగించుకోవడం వల్ల ఆటగాళ్లపై నెగెటివీటి (Negativity) పెరిగిపోతుందనే తాను సైలెంట్‌గా ఉంటానని చెప్పాడు. అంతేకాదు అలాంటి సమయంలో అరవడం వల్ల ఉపయోగం లేదన్న మాజీ క్రికెటర్.. తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై ఫోకస్ చేసి ఆ పోరపాట్లు సరిదిద్దుతానని తెలిపాడు.

ఈ మేరకు తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న ధోనీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు మేము ఎలాంటి తప్పు చేయొద్దని అనుకుంటాం. అది మిస్‌ఫీల్డ్ (Miss field)అయినా క్యాచ్ వదిలేయడమైనా కావొచ్చు. కొన్ని సార్లు ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. అలా అని ఆ ఆటగాడు కావాలని తప్పు చేసినట్లు కాదు. నేను ఆటగాడి స్థానంలో ఉండి ఆలోచిస్తాను. అతనిపై కోప్పడితే ఎలాంటి లాభం లేదు. స్టేడియంలో దాదాపు 40 వేల మంది కూర్చుంటారు. టీవీల్లో నుంచి కొన్ని కోట్ల మంది మనల్నీ గమనిస్తుంటారు. అందుకే కోపం తెచ్చుకోకుండా ఫీల్డింగ్‌లో ఎమైనా తప్పులు జరిగాయా అనే కోణంలో ఆలోచిస్తా. ఒకవేళ ఆటగాడు ఫుల్‌ ఫోకస్‌తో (Full focus) గ్రౌండ్‌లో ఉండి క్యాచ్ మిస్ చేస్తే అది పెద్ద ప్రాబ్లమే (problem) కాదు. కానీ ఫోకస్ పెట్టకుండా క్యాచ్ మిస్ చేస్తే మాత్రం ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్తా. కోపంలో ఆటగాళ్లపై అరిస్తే వారిని చులకన చేసినట్లు అవుతుంది. అది ప్లేయర్లపై నెగిటివ్ ఇంప్యాక్ట్ చూపిస్తుంది. నేను మనిషినే. మీలాగే నాకూ అనేక భావోద్వేగాలు ఉంటాయి. కానీ, వేల మంది మధ్యలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు నా భావోద్వేగాలను నియంత్రించుకుంటా’ అని వివరించాడు.

అలాగే కొన్ని పెద్ద మ్యాచ్‌ల్లో తప్పులు జరిగితే బ్యాడ్ కాదు వరస్ట్‌గా ఫీలవుతామన్న ఆయన.. ‘మేము ఎప్పుడూ బాగా ఆడడానికి ప్రయత్నిస్తాం. గ్రౌండ్‌లో మా భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తాం. బయట కూర్చొని.. లోపల గ్రౌండ్లో (Ground) ఆడేవాళ్లు ఇలా ఆడితే బాగుండు.. అలా ఆడితే బాగుండు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ గ్రౌండ్లో బయట చెప్పినంత సులభంగా ఉండదు. మేం ఎలాగైతే జాతీయ జట్టు తరఫున ఆడుతున్నామో మన ఆపోనెంట్ కూడా వాళ్ల జాతీయ జట్టుకు ఆడుతుంది. అంటే తప్పకుండా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది’ అని చెప్పుకొచ్చిన ధోని.. చివరగా క్రీడా కార్యక్రమాలకు ప్రజలు నిరంతరం మద్దతునివ్వాలని కోరాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -