end
=
Thursday, October 31, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంDialysis:డయాలసిస్ సేవలు సమర్థవంతంగా అందాలి
- Advertisment -

Dialysis:డయాలసిస్ సేవలు సమర్థవంతంగా అందాలి

- Advertisment -
- Advertisment -

  • టీచింగ్ ఆసుపత్రుల్లో కాటరాక్ట్, ట్రామా, కార్డియాక్, ఈఎన్టీ వంటి సర్జీలు పెరగాలి.
  • జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులకు జెరియాట్రిక్ కేర్ సెంటర్లు
  • హాస్పిటల్స్ లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ లు సమర్థంగా పని చేయాలి.
  •  టీచింగ్ హాస్పిటల్స్ కూ15 రోజుల్లో ఎయిర్ శాంపిలర్స్.
  • సాయింత్రం- రాత్రి వేళల్లో తగిన స్థాయిలో వైద్యులు, స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండాలి.
  • రాత్రి వేళల్లో పోస్ట్ మార్టం సేవలు అందించండి.
  • పారిశుధ్య నిర్వహణ, నాణ్యమైన డైట్ అందేలా చర్యలు తీసుకోవాలి.
  • జీవన్ దాన్ ద్వారా అవయవ మార్పిడిని ప్రోత్సహించండి.
  • వైద్యుల సూచన మేరకే సి-సెక్షన్ ఆపరేషన్లు చేయాలి.

మంత్రి హరీశ్ రావు (Harish Rao)మాట్లాడుతూ టీచింగ్ హస్పిటల్స్ పని తీరు పురగోతి ప్రతీ నెల పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ అన్ని  ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ వారం  ఆర్ఎంవోలు, సూపరిడెంట్లు   సమావేశమై  ఇన్ ఫెక్షన్ కంట్రోల్ పై సమీక్ష జరపాలి. అవరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ ను, నర్సును గుర్తించి వారికి నిమ్స్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది.  ప్రతీ హస్పిటల్ లో ఇన్భెక్షన్ సమస్యలు రాకుండా పకడ్బందిగా పని చేయాలి. మరో 15  రోజుల్లో  అన్ని ఆసుపత్రులకు ఎయిర్ శాంపిలర్స్ పంపుతాం.  ఎయిర్ చెకింగ్ తో పాటు, స్టెరిలైజేషన్(Sterilization) విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దు.  అలక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు. ప్రతీ ఆసుపత్రిలో దాదాపు కోటి రూపాయల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. వచ్చే వారంలో ఆరోగ్య శ్రీ నిధులు విడుదల చేయడం జరుగుతుంది. మీ హస్పిటల్స్ లోనే చాలినంత నిధులు అందుబాటులో ఉంటున్నాయి.

(Health Tip: ఈ చిట్కా పాటిస్తే చాలు.. దగ్గు క్షణాల్లో మాయం!!)

కాబట్టి మీ హస్పిటల్ అవసరాలకు ఆ నిధులు వినియోగించండి. ఆపరేషన్ ధియెటర్ల(Operation theaters)లో రొటేషన్ పద్ధతిలో ఇన్ ఛార్జిగా ప్రోఫెసర్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఆపరేషన్ ధియోటర్ల పని తీరును సమీక్షించాల్సిన బాధ్యత  ఆర్.ఎంవోలు, సూపరిండెంట్లు, ఫ్రోఫెసర్లదే. ఆసుపత్రిలో తప్పని సరిగా  రౌండ్స్ వేయాలి. కేస్ షీట్స్ ఎలా రాస్తున్నారు. మందులు  రోగులకు అందుతున్నాయా లేదా.. మందులు స్టాక్ ఉన్నాయా లేదా అన్న విషయాలు సమీక్షించాలి. హస్పిటల్ పరిసరాల పరిశుభ్రత, రోగులకు మంచి నీటి సౌకర్యం, ఫాన్లు, కుర్చీలు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాలన్నీ మీరు సమీక్షించాలి. ఎక్కడా ఇబ్బందులు తలెత్తినా వెంటనే పరిష్కరించాలి. సాయింత్రం, రాత్రి వేళల్లో తప్పనిసరిగా రౌండ్స్ కు వెళ్లి, అక్కడి రోగులతోను,వారి సహాయకులతోను మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవాలి.

వైద్యులు, నర్సుల ప్రవర్తన తీరు ఎలా ఉందో అడిగి తెలుసుకోవాలి. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే కఠిన చర్యలు తీసుకోండి. అలాంటి విషయాలను ఊపేక్షించవద్దు. కొద్ది మంది ప్రవర్తన వల్ల చెడ్డ పేరు వస్తుంది.  ఇలాంటి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. సిబ్బంది ప్రవర్తనపైన క్రమం తప్పకుండా సమీక్ష జరపండి. కొన్ని సందర్బాల్లో పేషంట్ల డిచ్ఛార్జ్  చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఇలా జరగకుండా  ప్రత్యేక పద్దతిని( మెథడాలజీ ) అభిృద్ధి చేయండి.  డిచ్ఛార్జ్(Discharge) సమయంలో వైద్యులు రాసిన మందులు అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో  ఇచ్చే పంపాలి. రోగులు డబ్బులు పెట్టి బయట కొనుక్కునే పరిస్థితి ఉండకూడదు. దీనిపైన ఆర్.ఎం.వోలు,  సూపరిడెంట్లు ప్రత్యేక శ్రద్ద వహించాలి. హస్పిటల్స్ లో నర్సింగ్ స్టాఫ్ 40:30:30  రేషియోలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉదయం వేళల్లో స్టాఫ్ ఎక్కువగా ఉండి,సాయింత్రం – రాత్రి వేళల్లో నర్సింగ్ స్టాఫ్ ఎక్కువ ఉండటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఈ పరిస్థితి ఉండకూడదు. సాయింత్రం, రాత్రి వేళల్లో అవసరమైన వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలి.

అత్యవసర సేవల విభాగంలో కూడా వైద్య సిబ్బంది తగిన రీతిలో ఉండాలి. అక్కడ పని చేసే సిబ్బంది ఓపికగా ప్రేమగా మాట్లాడుతూ, పేషంట్ల బాధను తగ్గించేలా వ్యవహరించాలి. బాగా పని చేయగలిగే ప్రేమతో వ్యవహించే సిబ్బందిని గుర్తించి వారికి విధులు అప్పగించాలి. ఓపీ, ఐసీయూ(ICU), పోస్ట్ ఆపరేషన్ విధులు ఎవరు నైపుణ్యంతో విధులు నిర్వర్తించగలుగుతారో  గుర్తించి  అందుకు అనుగుణంగా ఆ సిబ్బిందిని నియమంచే బాధ్యత సూపరిండెంట్లదే. సివిల్ సర్జన్లు ఆసుపత్రి సూపరిండెంట్లు, ఆర్.ఎంవోలునర్సింగ్ సూపరిండెంట్ల పని తీరుపై సమీక్ష జరపాలి. ప్రతీ రోజు సివిల్ సర్జన్లు, సూపరిండెంట్లు, నర్సింగ్ సూపరిండెంట్లు  హాస్పిటల్ లో ఏదో ఒక విభాగాన్ని ఆకస్మికంగా సందర్శించాలి. అక్కడి సమస్యలను గుర్తించాలి. ఆ డిపార్ట్మెంట్ లో పరిస్థితిని సమీక్షించాలి. మౌలిక సదుపాయాలు, వైద్య పరికాలు పని చేస్తున్నాయా లేదా.. రోగుల సమస్యలు అన్ని తెలుసుకుని , సూపరిండెంట్లకు దానిపై రిపోర్ట్ ఇవ్వండి. ఆపరేషన్ ధియోటర్లు,లేబర్ రూం(Labour Room) లలో స్టాఫ్ నర్సులతో పాటు కింది స్థాయి సిబ్బంది పనితీరును సమీక్షించాలి. రోగులతో, వారి సహాయకులతో ప్రవర్తన తీరును గమనించాలి. రోగుల నుండి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉండకూడదు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

(Menopause:మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయా?)

ఆర్ఎంవోలు, సూపరిడెంట్లు, నర్సింగ్ సూపరిండెట్లు, స్టాఫ్ నర్సులు తాము పని చేసే ప్రదేశంలో పరిశుభ్రత, తాగు నీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ తీరు వంటి వాటిని నిరంతరం పరిశీలించాల్సిందే. ఇది నా పని కాదన్న తీరు  ఉండకూడదు. పేషంట్లు హస్పిటల్ కు వచ్చినపుడు  వైద్య పరీక్షల కోసం రోగులే వెళ్లడం, లేదా రోగి సహాయకులు తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదు. హస్పిటల్ సిబ్బందే వారిని వై ద్య పరీక్షలకు స్ట్రెచర్(Stretcher) లేదా  మెడికల్ వీల్ ఛైర్ లో కూర్చోపెట్టి గౌరవంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వం  అన్ని  అవసరాలను, సౌకర్యాలను పెంచింది. పని తీరులో కూడా మార్పు రావాలి. వైద్యపరికరాలు పాడయితే వెంటనే వాటిని గంటల్లోనే రిపేర్ చేసేలా పీఎంయూ విధానం తీసుకువచ్చాం. మెడికల్ పరికరాలు(Instruments) పాడయితే ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం వస్తే వెంటనే వాటిని  రిపేర్ చేయిస్తున్నం. దీన్ని వినియోగించుకోవాలి. ప్రతీ ఆసుపత్రిలో నిబంధనల మేరకు రాత్రి వేళ పోస్ట్ మార్టం చేయాలి.

హస్పిటల్ లోని ప్రతీవిభాగం  పని చేసేలా చూసే బాధ్యత ఆర్ఎంవోలు, సూపరిండెంట్లదే, తమ ఆసుపత్రిలోని మలేరియా విభాగమైనా, టీ-డయాగ్నస్టిక్ సర్వీలైనా, బ్లడ్ బ్యాంకులయినా,  డయాలిసిక్ కేంద్రాలు, ఎంసీహెచ్ విభాగాలు, డైట్, పారిశుధ్యం ఇలా ప్రతీ విభాగం మీదే బాధ్యత.డైట్ మెనూ తెలుగులో ప్రతీ వార్డులో రోగులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. డైట్  విషయంలో ఎలాంటి ఫిర్యాదు వచ్చినా సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలి. అదే రీతిలో పారిశుధ్య నిర్వహణ తీరుపైన సమీక్ష జరపాలి. ప్రభుత్వం  శానిటేషన్ వేతనాలు, డైట్ చార్జీలు పెంచడం జరిగింది. ఈ విషయంలో   ప్రగతి సాధించాలి. దీనిపైన  అన్ని ఆసుపత్రుల ఆర్.ఎంవోలు,సూపరిండెంట్లు(Superintendents) పరిశీలన జరపాలి.  హస్పిటల్ లో రోగులకు ఇస్తోన్న భోజనం చేసి నాణ్యతను పరీక్షించాలి.హైదరాబాద్  పరిధిలోని ఆసుపత్రుల్లో రోగి సహాయకులకు ఐదు రూపాయల బోజనం ప్రభుత్వం పెడుతోంది. ఈ భోజనం అందుతున్న తీరును , నాణ్యతను పరిశీలించండి. తాగు నీరు అందుతుందా లేదా పరిశీలించండి.

టీచింగ్ హస్పిటల్స్ కు 800 మంది సీనియర్ రెసిడెంట్లను పంపాం. ప్రతీ ఆసుపత్రికి 25 నుండి 30 మంది ఎస్. ఆర్ లు కేటాయించడం జరిగింది. ఎవరైనా జాయిన్ అవకపోతే డీఎంఈకి సమాచారం ఇవ్వాలి. పారదర్శకంగా, కౌన్సిలింగ్ చేసి వారిని పంపడం జరిగింది. 12 నెలల పాటు వారు కేటాయించిన హస్పిటల్ లో పని చేయాల్సిందే. వారికి పని నేర్పించాలి. వారి సేవలు ప్రణాళికా బద్దంగా వినియోగించుకోవాలి. దీంతోపాటు త్వరలో 2 వేల మంది పీజీ స్టూడెంట్లను వివిధ ఆసుపత్రులకు పంపుతాం.గర్భిణీలకు టిప్ఫా స్కానింగ్ కోసం 56 మిషన్లు  కొనుగోలు చేయడం జరిగింది. త్వరలోనే వాటిని పంపుతాం.  ఇక మీదట టిప్ఫా స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి. ఇప్పటికే గైనకాలజీ(Gynecology) డాక్టర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వెల్ నెస్ కేంద్రాలు చక్కగా పని చేయాలి. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు సేవలు అందించే ఈ కేంద్రాల పని తీరులో ఇంకా పురోగతి సాధించాలి. మందులు ఉన్నాయా లేదా పరిశీలించాలి.  ఏదైనా సమస్య ఉంటే ఆరోగ్య శ్రీ సీఈవోకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలి.మీ ఆసుపత్రుల్లో టీ-డయాగ్నస్టిక్ సేవలు బాగా అందేలా  చూడాలి.  వైద్యపరీక్షల సమాచారం సంబంధిత వ్యక్తి ఫోన్ కు 24 గంటల్లో సమాచారం అందేలా చూడాలి. పీహెచ్సీల నుంచి వచ్చే శాంపిల్స్ కు కూడా 24 గంటల్లో ఎస్.ఎం.ఎస్ లు చేరేలా చర్యలు తీసుకోవాలి.

జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులకు జెరియాట్రిక్ కేర్ సెంటర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నం.ఎస్.ఎన్. యూసీల పనితీరుపైన నిరంతరం సమీక్ష జరపాలి. డెత్ ఆడిట్, రెఫరల్ కేసులు పై నిరంతర సమీక్ష జరపాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలి. న్యూట్రిషన్, రిహాబిలిటేషన్(Rehabilitation) కేంద్రల పనితీరును సమీక్ష జరపాలి.సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో టీ-డయాగ్నస్టిక్ సర్వీసులకు సంబంధించిన సమాచారం 24 గంటల్లో పంపడంలో రాష్ట్రంలో ముందున్నాయి. వారికి నా అభినందనలు.నార్మల్ డెలివరీ కి సంబంధించి  ఇన్సెంటీవ్  ఎక్కువ పొందిన సూర్యపేట హస్పిటల్ సిబ్బందికి, పెట్ల బురుజు హస్పిటల్  సిబ్బందికి, తర్వాతి స్థానాల్లో ఉన్న గాందీ, నీలోఫర్ హస్పిటల్ సిబ్బందికి అభినందనలు.

అవసరం లేని సి- సెక్షన్ ఆపరేషన్లు జరగకుండా చూడాలి. వైద్యులు సూచన మేరకే సి- సెక్షన్ జరగాలి. బర్త్ ప్లాన్ సరిగా నిర్వహించాలని నా సూచన. గర్భిణులు చేయాల్సిన  ఎక్సర్ సైజ్ లు సక్రమంగా చేసేలా చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన వీడియోలు చూసే ఏర్పాటు చేయాలి.అన్ని ఆసుపత్రుల ఆర్.ఎంవోలు,సూపరిండెట్లు అవయవదానాన్ని ప్రోత్సహించండి. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేయాలి. ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital) ఆరు కేసులు చేశారు. ప్రతీ నెల ఉస్మానియా లో  జీవన్ దాన్ ద్వారా అవయవదానం జరుగుతోంది. ఉస్మానియా ఆసుపత్రి సిబ్బందికి అభినందనలు.  ఇతర ఆసుపత్రుల సూపరిండెంట్లు జీవన్ దాన్ ను ప్రోత్సహించాలని ఆదేశం.ఈ సమీక్షలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి,  ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి,  టీఎస్ఎంఐడీసీ  ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -