end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Birds: పక్షుల్లోనూ విడాకుల సంప్రదాయం..
- Advertisment -

Birds: పక్షుల్లోనూ విడాకుల సంప్రదాయం..

- Advertisment -
- Advertisment -

ఈ భూమిమీద నివసించే ప్రాణుల్లో పెళ్లి, విడాకుల తంతు కేవలం మానవుడికే అంకితమని భావిస్తాం. కానీ, సముద్ర పక్షులైన ఆల్బట్రాస్‌లు (Albatrosses) అత్యంత ఏకస్వామ్య జీవులని చాలామందికి తెలియదు. ఇవి తమ పార్ట్‌నర్‌తో (Partner) జీవితాంతం సహజీవనం చేస్తాయి. 50 ఏళ్లకు పైబడి జీవించే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం రెండు సంవత్సరాలకు ఒకసారి ఒకే భాగస్వామితో మేటింగ్ (Mating) చేస్తాయి. అయితే పిరికి లక్షణాలతో ఘర్షణకు దూరంగా ఉండే మేల్స్.. బ్రేకప్ (breakup) చెప్పే అవకాశముందని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

(ఈ విషయాలు మీకు తెలుసా..?)

అడవి జంతువుల్లో విడాకులను అంచనా వేసేందుకు వ్యక్తిత్వాన్ని కారణంగా చూపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా ఈ పక్షుల మధ్య విడాకులను (Divorce) అధ్యయన రచయిత అరుదైన సంఘటనగా పేర్కొన్నారు. కానీ ఒక నిర్దిష్ట భాగస్వామితో సంతానోత్పత్తిలో సక్సెస్ (success) రేటు చాలా తక్కువగా ఉన్నప్పుడు అవి మరొక పార్ట్‌నర్‌ను (Partner) వెతుక్కుంటాయి. అయితే ఒక పక్షి వ్యక్తిత్వం అనేది విడాకులు తీసుకునే సంభావ్యతను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు పరిశోధకులు ఒక ప్రత్యేకమైన డేటాబేస్‌ రూపొందించారు. ఈ మేరకు 1959 నుంచి దక్షిణ హిందూ మహాసముద్రంలోని క్రోజెట్ (Crozet) ద్వీపసమూహంలో గల పొసెషన్ (Possession) ద్వీపంలో సంచరించే ఆల్బట్రాస్‌ల కాలనీని ట్రాక్ చేస్తున్న శాస్త్రవేత్తలు.. కొన్ని పక్షుల కాలికి స్టెయిన్‌లెస్ రింగ్‌ను (Stainless ring) ఫిక్స్ చేశారు. ఇక ప్రతి రెండేళ్లకోసారి పిల్లలను కనే ఈ పక్షులు వాటిని పెంచేందుకు ఏడాది సమయం తీసుకుంటాయి. ఈ క్రమంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు మరో ఏడాది విశ్రాంతి తీసుకుంటాయి. అప్పటి వరకు మేల్స్‌తో మేటింగ్ చేయవు.

భయంతోనే బ్రేకప్.. పరిశోధకులు ఒక దశాబ్దానికి పైగా దాదాపు 2,000 పక్షుల్లో ధైర్య లక్షణాలను పరిశీలించారు. అయితే ఫిమేల్ పార్ట్‌నర్స్ (Female partners) కంటే పిరికి లక్షణాలు గల మగ ఆల్బట్రాస్‌లకే విడాకులు తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువని కనుగొన్నారు. ఇక జంటగా సంచరించే ఆల్బాట్రాస్‌లలో రొమాంటిక్ ప్రక్రియలు ఉంటాయని.. తమ రెక్కలను పైకి లేపి చప్పుడు చేస్తూ చుట్టూ నృత్యం చేస్తాయని అధ్యయనం తెలిపింది. కొన్నిసార్లు ఈ ప్రక్రియలో ఇతర మగపక్షులు ఆ జంటను విడదీసేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటప్పుడు భయంతో ఘర్షణకు దూరంగా ఉండే మేల్స్ (males) విడాకులు అంగీకరిస్తాయి. అలాగే శీతోష్ణస్థితి మార్పు కూడా ఆల్బట్రాస్‌లో విడాకులకు కారణమవుతుందని గతేడాది పరిశోధన (Research) సూచించింది. ఎందుకంటే ఈ సమయంలో చేపల సంఖ్య తగ్గుముఖం పడుతుంది కనుక పక్షులు ఆహారం కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -