end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంEye Brows:కనుబొమ్మలు అందంగా ఉండాలి అంటే?
- Advertisment -

Eye Brows:కనుబొమ్మలు అందంగా ఉండాలి అంటే?

- Advertisment -
- Advertisment -

అందం(Beauty) గా కనిపించాలి అని ఎవరికి ఐనా ఉంటుంది కదా.ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది.మన మొహం లోని హావభావాలను కనిపించేలా చేసేది కళ్లే. కళ్లే అమ్మాయిలకు ప్రత్యేక ఆకర్షణ . ఆ కళ్లకు అందం కనుబొమ్మలు. కళ్ళు అందం గా కనిపించాలి అంటే మనకు అందమైన కనుబొమ్మలు(Eyebrows) ఉండాలి. ఒత్తుగా ఉండే ఐబ్రోస్ ముఖానికి మరింత వన్నె(Pretty) తీసుకొస్తాయి. ఒత్తైన కనుబొమ్మలు కావాలని అందరూ కోరుకుంటారు. అయితే, అందరికీ ఒత్తుగా ఉండవు కొంతమందికి పలుచగా ఉంటాయి.మరికొందరికి సన్నగా ఉంటాయి. ఒకప్పుడు సన్నని కనుబొమ్మలను ఇష్టపడేవారు. ఇప్పుడు ఒత్తైన కనుబొమ్మలనే ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు అది ట్రెండ్ అయింది. ఐబ్రోస్ ఇలాగే చేయించుకుంటున్నారు. కళ్ల కి అందం మరింత పెంచాలనీ మాస్కరా వాడుతారు. అలాగే కనుబొమ్మలు కనిపించేందుకు ఐబ్రో పెన్సిల్స్(Eyebrow pencil) ను యూజ్ చేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటివి వాడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం. 

(Curry leaf: ‘కరివేపాకు’తో అందం, ఆరోగ్యం..!)

కొబ్బరి నూనెతో మసాజ్:

మనం సాధారణం గా జుట్టుకి కొబ్బరి పెడుతూ ఉంటాం ఎందుకు ఒత్తుగా పెరుగుతుంది అని కదా అలాగే మనం కనుబొమ్మలకి కొంచం నూనె రాసి ముని వేళ్ళతో మృదువుగా మసాజ్ ల చేయండి. అప్పుడు కొబ్బరి నూనె ఉడిపోవడాన్ని అపుతుంది. మసాజ్(Massage) చేసినందుకు రక్త ప్రసరణ కూడా పెంచుతుంది. రాత్రి పడుకునే ముందు ఒకసారి ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

ఆముదం నూనె:

కనుబొమ్మలు ఒత్తుగా అయ్యేందుకు సహాయపడే వాటిలో ఆముదం నూనె ఒకటి. ఇందుకోసం ఆముదం నూనెలో ఒక కాటన్ క్లాత్ ను ముంచి రెండు కనుబొమ్మలపై బాగా రాయాలి. ఆ తర్వాత వేలికొనలతో రెండు లేదా మూడు నిమిషాలు బాగా మసాజ్ చేయండి. ఇలా చేశాక ఒక అరగంట గోరువెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే సరిపోతుంది. అందమైన ఒత్తుఐన కనుబొమ్మలు మీ సొంతం.

ఉల్లిపాయ రసం:

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి విని ఉంటారు కదా. ఉల్లి రసం(Onion Juice) మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది హెయిర్ ఫాల్ ని  తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఉల్లిపాయ లో ఒక సగం ముక్కని  తీసుకుని మిక్సీలో వేసి రసం వచ్చాక కనుబొమ్మలపై అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేస్తే అయిపోతుంది. ఉల్లిరసం కనుబొమ్మలు త్వరగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.

గుడ్డు లో యెల్లో సోనా:

గుడ్డు(Egg) అంటే ప్రోటీన్, ప్రోటీన్ అంటే గుడ్డు. ఇవి కనుబొమ్మలు పెరిగేందుకు కూడా సహాయపడతాయి. ఎలా అంటారా ఒక గుడ్డు తీసుకొని అందులోని తెల్ల సోనాని తీసేసి యెల్లో సోనా ని బాగా బీట్ చేసి కనుబొమ్మలకి రాయండి. రాసిన 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇవి మీ కను బొమ్మలు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి.  

(Mental Laziness: తన భావోద్వేగాలను చెప్పలేని పరిస్థితి)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -