end
=
Thursday, November 21, 2024
వార్తలుజాతీయంవ్యాక్సిన్ పట్ల సందేహాలు వద్దు
- Advertisment -

వ్యాక్సిన్ పట్ల సందేహాలు వద్దు

- Advertisment -
- Advertisment -
  • కేంద్ర వైద్యారోగ్య శాఖ

న్యూఢిల్లీ: జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర వైద్యఆరోగ్య శాఖ అందుకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మొత్తం 110 లక్షల ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ డోస్‌లను తొలి దశ వ్యాక్సినేషన్‌లో అందించేందుకు గానూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు ధర 200 రూపాయలుగా ఆయన వెల్లడించారు. భారత్ బయోటెక్(బీబీఐఎల్) కోవ్యాక్సిన్‌ 55 లక్షల డోసులు సరఫరా చేయనున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు. అయితే.. ఈ 55 లక్షల డోసుల్లో 16.50 లక్షల డోసులను భారత్ బయోటెక్ ఉచితంగా సరఫరా చేస్తోందని, మిగిలిన 38.5 లక్షల డోసులకు గానూ.. ఒక్కో డోసుకు 295 రూపాయలను కేంద్రం చెల్లిస్తోందని ఆయన పేర్కొన్నారు.

కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌లు రెండూ అత్యవసర వినియోగంలో భాగంగా అందించనున్నారని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తదనంతర పరిణామాలపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. ట్రయల్స్‌లో భాగంగా వేల మందిపై ఈ రెండు వ్యాక్సిన్లను ప్రయోగించారని, వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు అంతగా లేవని వారు వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -