end

కరోనాపై నిర్లక్ష్యం వద్దు : పీఎం మోడి

  • ప్రజలు కోవిడ్‌ 19 నిబంధనలు తప్పక పాటించాలి

భారతదేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రధానీ నరేంద్ర మోడి ప్రజలను హెచ్చరించారు. కరోనాకు టీకా/వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యం వహించరాదని కోరారు. మధ్యప్రదేశ్‌లో పీఎం ఆవాస్‌ యోజన స్కీం కింద నిర్మితమైన ఇళ్లకు వర్చువల్‌గా గృహ ప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం మోడి మాట్లాడుతూ కోవిడ్‌ 19 వ్యాధికి పూర్తి స్థాయి వ్యాక్సిన్‌ రావడానికి సమయం పడుతుందని, అంతవరకు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. ముఖానికి మాస్క్‌, శానిటైజేషన్‌, వ్యక్తుల మధ్య కనీసం రెండు గజాల దూరం పాటించాలని వివరించారు.

Also Read…

Exit mobile version