end

Mental Stress: స్ట్రెస్ తగ్గాలంటే ఇలా చేయండి..

Mental Stress : మనం చూస్తూ ఉండగానే జీవనశైలి(Life Style) లో చాలా మార్పులొస్తున్నాయి.ఈ రోజుల్లో ఒత్తిడి లేని మనిషి లేడు, గజిబిజీ లైఫ్ లో ఆర్థిక సమస్యలు(Financial Problems), కుటుంబ సమస్యలతో (Familiy Issues) చాలా మంది ఒత్తిడికి లోనై బాధపడుతున్నారు. సమస్య చిన్నది అయిన పెద్దది అయిన మానసికంగా క్రుంగదీయడమే కాకుండా శరీరకంగా కూడా ప్రభావం చూపెడుతుంది.శారీరకంగా అలసిపోతే… విశ్రాంతి తీసుకుంటాం… మానసికంగా అలసిపోతే మాత్రం తీసుకోలేము. ఎందుకంటే టెన్షన్లతో వచ్చే అలసటను మనం పట్టించుకోం. కానీ అదే తెలియకుండానే ఎన్నో వ్యాధులు వచ్చేందుకు కారణం అవుతోంది. మానసిక ఒత్తిళ్లు వేరువేరు కారణాల వల్ల ఎందరో ఆత్మహత్యల(Suicide)కు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వారి కుటుంబం గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటే సమస్యకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు చెబుతున్నాఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. అంతేకాదు మానసిక ఒత్తిళ్లు(Stress) కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

(Belly Fat:కూర్చొని కూర్చొని పొట్ట పెరిగిపోయిందా..?)

(Over Thinking) పదేపదే ఆలోచించవద్దు: మనసులో ఏది ఐనా బాద ఉంటే అదే విషయం గురించి పదే పదే ఆలోచించడం(Over thinking) వల్ల అధిక ఒత్తిడికి గురై లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశాలుంటాయి. ఆఫీసు లో విషయలు ఆఫీసు లోనే మర్చిపోవాలి మళ్ళీ ఇంటికి వచ్చి అలోచించడం మంచిది కాదు.ఆఫీసు లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడూ మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని బూతద్దం లో చూసి ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా బాగా కుంగిపోతాము. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి.

(Lonleyness) ఒంటరితనం వద్దు..: మనసు బలేనప్పుడు ఎప్పుడు ఒంటరి(Alone)గా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే ఏదో ఒక అలజడి మొదలవుతుంది మదిలో. ఇప్పుడు ఒంటరిగా ఉండే ఛాన్స్ లేకుండా మనకు మొబైల్ ఉంటుంది. మొబైల్ లో ఇష్టం ఉన్న సాంగ్స్ వినడం సినిమాలు చూడటం మేలు. లేదా స్నేహితులతో మాట్లాడుతుండాలి. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా వల్ల తో అన్నీ షేర్ చేసుకోవాలి ఏది ఐనా బాద ఉంటే తగ్గిపోతుంది అలాగే ఒత్తిడి ఉండదు మనసు తేలిక(Relieved) పడుతుంది.

(Sleepless)ఒత్తిడికి అనేక కారణాల్లో నిద్రలేమి: మనిషికి మంచి నిద్ర ఖచ్చితంగా అవసరం. అలా కాకుండా బాగా సంపాదించాలని చాలా మంది రోజూకు నాలుగైదు గంటలు మాత్రమే పడుకుంటారు. మనం ప్రతి రోజు కనీసం ఆరు గంటలైన నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రలేకపోతే(Insomnia) అనేక అనారోగ్య సమస్యలు ఎదురుకుంటాం. అంతేకాదు సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం చాలా మంచిది.. ఇలా పక్కగా పాటిస్తే ఒత్తిడి నుంచి బయటపడచ్చు.

(Physical Exercise) వ్యాయామం లేదా యోగా: ప్రతిరోజూ ఉదయం లేవగానే యోగా లేక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడి తగ్గాలి అంటే వ్యాయామం(Walking), వాకింగ్, రన్నింగ్ తప్పక చెయ్యాలి. కనీసం రోజుకు 45 నిమిషాల పాటు ఈ వ్యాయామలు చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా(Calmly) ఉండడానికి సహాయ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. రాత్రిపూట త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తే మానసిక ప్రశాంతత దొరుకుంది.

(Avoid Drinking Alcohol) మద్యానికి దూరంగా ఉండడం: ఈ రోజుల్లో సంతోషం వచ్చిన బాద వచ్చిన తాగడం చాలా అలవాటు అయిపోయింది. చెడు అలవాటు అని తెలిసినా మద్యాన్ని మానేయలేరు. కొన్నిసార్లు మద్యం సేవించి ఏమి చేస్తున్నారో తెలియక సొంత వాళ్ళని ఫ్రెండ్స్ ని కోల్పోయిన సందర్భాలు విన్నాం చూసాం. సాధ్యమైనంతవరకు మద్యం మానేయడం కష్టం ఎందుకు అంటే అంతలా బానిసలు అయ్యారు. కాబట్టి  తగ్గించదానికి ప్రయత్నం చేయండి. మద్యం సేవిండం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి.. వైరస్ ని మన శరీరంలోకి మనమే ఆహ్వానిస్తున్నాం. మద్యం(Alcohol) సేవించడం తగ్గించండి. ఇలా చేస్తే ఖచ్చితం గా ఒత్తిడి నుండి తప్పించుకోవచ్చు ప్రయత్నించి చూస్తే తప్పు లేదు కదా.

(Olive Oil: ఆలివ్ ఆయిల్ మధుమేహాన్ని నియంత్రించగలదా?)

Exit mobile version