- కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా వైఎస్ షర్మిల (YS Sharmila) అరెస్టు సంచలనంగా మారింది. అయితే ఆమె చేస్తున్న పోరాటం సెగలు అన్ని పార్టీలకు తాకుతున్నాయి. దీంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో మొదలైన రాజకీయ యుద్ధం క్రమంగా భాగ్యనగరానికి (Hyderabad) వ్యాపించి అల్లకల్లోలంగా మార్చింది. అరెస్టు (Arrest) అనంతరం బెయిలపై (Bail)వచ్చిన YSRCP అధ్యక్షురాలు షర్మిల టీఆర్ఎస్ (TRS) నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి. ఈ పొలిటికల్ టెన్షన్ రాజ్‌భవన్‌కు (RAJBHAVAN) కూడా చేరుకోనుంది. వైఎస్ షర్మిల గురువారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai Soundararajan) ను కలవనున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఓ చానెల్ డిబేట్‌లో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM KCR), టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (MLA) ఆస్తులపై సిట్టింగ్ జడ్జి (JUDGE)చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. అలాగే తన ఆస్తులపైనే ఎంక్వైరీకి సిద్ధమంటూ సవాల్ విసిరారు. అవినీతి చేయకుంటే అందరిపై విచారణ జరిపించాలని కోరారు. ప్రజల అభిప్రాయాలనే వ్యక్తపరుస్తున్నానంటూ తెలిపారు.
అలాగే టీఆర్ఎస్‌లో ఉద్యమకారులు ఎవరూ లేరన్న ఆమె.. రాయలసీమకు (Rayalaseema) చెందిన మహిళగా తెలంగాణలో రాజకీయాలు చేయడంపై పలువురు ప్రశ్నిస్తున్నారని దానికి ముక్కుసూటిగా సమాధానం చెప్పింది. టీఆర్ఎస్ మాత్రమే అలా పేర్కొంటోంది అంటూ తెలిపారు. తెలంగాణ ప్రజలకు అంతా తెలుసని తాను పెరిగింది ఇక్కడే.. పెళ్లి చేసుకుంది ఇక్కడేనంటూ తెలిపారు. భవిష్యత్తు కూడా ఇక్కడే అని స్పష్టం చేశారు. ప్రతీరోజూ ప్రజల కోసం పోరాడుతున్నామని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ అవినీతిని ఎత్తిచూపుతున్నది వైఎస్ఆర్‌టీపీ (YSRTP)మాత్రమేనని తెలిపారు. మిగతా పార్టీలు ఏవీ మాట్లాడటం లేదని తెలిపారు. కాంగ్రెస్ (CONGRESS), బీజేపీ (BJP)వాటా తీసుకుని మాట్లాడటం లేదని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నిన్న వరంగల్‌లో ఆమె పాదయాత్రను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పర్చారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు కల్వకుంట్ల కవితపై (Kavitha) కూడా ఆరోపణలు చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఎప్పుడైనా సమస్యలపై స్పందించావా అంటూ ప్రశ్నించారు. తన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
(Ys Sharmila:ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే తప్పా?)
ఇక తాను కేసీఆర్, ఆ పార్టీ నాయకుల గురించి వ్యక్తిగత కామెంట్లు చేయలేదని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రజల సొమ్మును దండుకుని అవినీతికి పాల్పడుతున్నారని డిమాండ్ చేశారు. అయితే షర్మిల ఆస్తులపై విచారణ జరిపించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (MLA Peddi Sudarshan Reddy) చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, అలాగే మీ ఆస్తులపై కూడా విచారణ చేపట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వంకు దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. అవినీతి చేయలేదని గొప్పలు చెప్పుకొంటున్న నేతలందరిపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ
రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ తమ పార్టీనని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా సమస్యలను ఏ పార్టీ కూడా పోరాడటం లేదని, ఇతర పార్టీల వారు తమతమ వాటాలు తీసుకుని సైలెంట్‌గా ఉండిపోతున్నారని ఆరోపించారు. తాము ప్రజా సమస్యలపై పోరాడటంలో ముందున్నామన్నారు. ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేని నేతలు తన గురించి మాట్లాడుతారా..? అంటూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం అవినీతికి పాల్పడేది టీఆర్‌ఎస్ నేతలని, ఒక్కరు కూడా ప్రజా సమస్యలపై పోరాడింది లేదని అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించలేని నేతలకు తనపై మాట్లాడే హక్కు ఎక్కడుందంటూ ప్రశ్నించారు. తపై విమర్శలు చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇవ్వడం విశేషం.