end
=
Thursday, November 21, 2024
బిజినెస్‌కరోనా కాలంలో అంబానీ ఆర్జన ఎంతో తెలుసా..!
- Advertisment -

కరోనా కాలంలో అంబానీ ఆర్జన ఎంతో తెలుసా..!

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కారణంగా ధనిక-పేద అంతరాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆక్స్‌ఫామ్ తాజాగా ఓ సంచలన నివేదిక ప్రచురించింది. ‘అసమానతల వైరస్’ పేరిట విడుదలైన ఈ నివేదికలో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ ప్రస్తావన కూడా ఉంది. దీని ప్రకారం.. కరోనా కాలంలో ముఖేశ్ సంపద గంటకు 90 కోట్ల రూపాయల మేర పెరిగిందని తేలింది. ప్రత్యేన నైపుణ్యాలేమీ లేని ఓ సామాన్య కార్మికుడు కనీసం మూడేళ్ల పాటు కూడబెట్టిన మొత్తం అంబానీ ఒక్క సెకెనులో ఆర్జించిన దానితో సమానమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. దేశంలోని 24 శాతం మంది ప్రజల సగటు సంపాదన నెలకు కేవలం రూ. 3 వేల రూపాయలు మాత్రమేనంటూ పేదల కష్టాలను కళ్లకు కట్టినట్టు వివరించింది. ఈ కాలంలోని అంబానీ ఆర్జించిన సంపదతో ఆరు నెలల పాటు ప్రత్యేక నైపుణ్యాలేవీ లేని సామాన్య కార్మికులను పేదరికంలో కూరుకుపోకుండా కాపాడవచ్చని కూడా పేర్కొంది.

కరోనా కారణంగా ధనిక-పేద వర్గాల మధ్య అగాధం మరింత పెరిగిందని నివేదికలో ఆక్స్‌ఫామ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సంక్షోభం ప్రారంభమైన మార్చి నెల నుంచి భారత్‌లో 100 మంది అపరకుబేరుల సంపద సుమారు 12 లక్షల కోట్ల మేర పెరిగిందని, దీనితో దేశంలో 13.8 కోట్ల పేదలకు ఒక్కొక్కరికీ రూ. 94 వేల చొప్పున చెక్కులు ఇవ్వొచ్చని ఆక్స్‌ఫామ్ వ్యాఖ్యానించింది. తొలి 11 మంది అపరకుబేరుల సంపాదనతో జాతీయ ఉపాధి పథకాన్ని లేదా ఆరోగ్య శాఖను పదేళ్ల పాటు సునాయసంగా నిర్వహించ్చని కూడా పేర్కొంది. ధనికుల సంపద వేగంగా పెరిగిన దేశాల్లో భారత్ ఆరోస్థానంలో ఉందని కూడా ఆక్స్‌ఫామ్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. తొలి ఐదు స్థానాల్లో వరుసగా అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ దేశాలు నిలిచాయి. గత వందెళ్లలో ప్రపంచం చవి చూసిన అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం కరోనా మహమ్మారి అని ఆక్సాఫామ్ అభిప్రాయపడింది. దీని పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని 1930 నాటి మాహామాద్యంతో పోల్చవచ్చని కూడా పేర్కొంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -