end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయంపానీ పూరీ అంటే చాలా ఇష్టమా....
- Advertisment -

పానీ పూరీ అంటే చాలా ఇష్టమా….

- Advertisment -
- Advertisment -

పానీ పూరీ అంటే పిల్లలు ఇటు పెద్దలు సాయంత్రం ఎక్కువ ఇష్టంగా తినే చిరుతిండి అయితే పానీ పూరీ ని కొన్ని రోజులు పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది మనకి, ఎందుకు అంటారా, తెలంగాణలో గత కొంత కాలంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు కొన్ని వాస్తవాలు చెప్పారు. బయట పానీపూరీ తినడం వల్ల టైఫాయిడ్ కేసులు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. పానీపూరీ వల్ల టైఫాయిడ్ కేసులు వస్తున్నాయన్నారు. టైఫాయిడ్‌కు మరో పేరుగా పానీపూరీని చెప్పుకోవచ్చన్నారు. రుచిగా ఉంటాయనే కారణంతో జనాలు ఇష్టంగా పానీపూరీ తినడానికి ఆసక్తి చూపుతుంటారన్న ఆయన వర్షాకాలంలో తోపుడు బండ్ల దగ్గర పానీపూరీ తినొద్దని హెచ్చరించారు. బయటి తినే పది రూపాయల ఆహారం కారణంగా వేలాది రూపాయలు హాస్పిటల్ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. వర్షాకాలంలో కొన్ని జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరం ఎంత అయిన ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -