end
=
Monday, April 21, 2025
వార్తలుజాతీయంచెంప మీద కొట్టి.. ఈడ్చుకెళ్లిన డాక్ట‌ర్‌.. పాపం ఆ వృద్ధుడు !
- Advertisment -

చెంప మీద కొట్టి.. ఈడ్చుకెళ్లిన డాక్ట‌ర్‌.. పాపం ఆ వృద్ధుడు !

- Advertisment -
- Advertisment -

త్వ‌ర‌గా వైద్యం చేయ‌మ‌ని(Asking for Treatment) కోరినందుకు వృద్ధుడిపై చెంపదెబ్బ చేసుకున్నాడు ఓ డాక్ట‌ర్‌(Doctor`s misbehave). అంతేకాదు.. వృద్ధుడిపై ఏదో వ్య‌క్తిగ‌త క‌క్ష‌లున్న‌ట్లు కోపంతో ఊగిపోయాడు. బూతుపురాణం(Scolding) అందుకున్నాడు. అక్క‌డితో ఆగ‌కుండా వృద్ధుడి కాలు ప‌ట్టుకుని కొన్ని మీట‌ర్ల వ‌ర‌కూ ఈడ్చుకెళ్లాడు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌(Madya pradesh)లోని ఛ‌త‌ర్‌పూర్‌లో వెలుగు చూసింది. ఛ‌త‌ర్‌పూర్‌కు చెందిన 77 ఏళ్ల వృద్ధుడు ఉధవ్‌లాల్ జోషి(Udhavlal Joshi) రెడ్ క్రాస్ సంస్థ‌లో సుదీర్ఘ‌కాలం నుంచి ప‌నిచేస్తున్నాడు.

కొంత కాలం నుంచి అత‌డి భార్య‌ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ది. దీంతో ఆమెను గురువారం చికిత్స కోసం స్థానిక జిల్లా ప్ర‌ధాన ఆసుప‌త్రికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో డాక్టర్ రాజేష్ మిశ్రా విధుల్లో ఉన్నాడు. భార్య వ‌ణికిపోతుండ‌టంతో ఆందోళ‌న చెందిన వృద్ధుడు డాక్ట‌ర్ మిశ్రా వ‌ద్ద‌కు వెళ్లాడు. త‌న భార్య‌కు తొంద‌ర‌గా వైద్యం చేయాల‌ని కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన డాక్ట‌ర్ మిశ్రా ఆ వృద్ధుడిని దూషించాడు. పెద్ద‌వాడ‌నే గౌర‌వం లేకుండా చేయిచేసుకున్నాడు. అంద‌రూ చూస్తుండ‌గా వృద్ధుడి కాలు ప‌ట్టుకుని ఈడ్చుకెళ్లాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా విష‌యం తెలుసుకున్న వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు డాక్ట‌ర్ మిశ్రాపై వేటు వేశారు.

వృద్ధుడిపై దాడిపై దర్యాప్తు కమిటీని నియ‌మించారు. దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. డాక్ట‌ర్ ప్ర‌వ‌ర్తించిన త‌ప్పు అని, అత‌డిని క‌ఠినంగా శిక్షించాల‌ని నెటిజన్లు కామెంటుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -