వైద్య సిబ్బంది కృషి వల్లే తాను కరోనా మహమ్మారిని జయించగలిగానని ప్రముఖ సినీనటి తమన్నా భాటియా తెలిపారు. తమన్నా.. కరోనా బారిన పడి, కోలుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. వైద్యులు ధైర్యం చెప్పడం వల్లే తాను కరోనా నుంచి త్వరగా బయటపడ్డాననీ.. నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి తానెప్పుడూ ఋణపడి ఉంటానని ధన్యవాదాలు తెలిపారు.