end

Prasadam:మనం పెట్టిన నైవేద్యం దేవుడు తింటాడా?

మేఘాలు భూమిపై ఉన్న నీటిని గ్రహించి మళ్లీ తిరిగి వర్షరూపంలో భూమికి చేరవేస్తాయి. అలాగే భక్తుడు మంత్రపూర్వకంగా సమర్పించే నివేదనలను భగవంతుడు అతని శ్రేయస్సుకే తిరిగి ఇస్తాడని మరీచికల్పం(Mirage) అనే గ్రంథం చెబుతోంది. అంటే మనమిచ్చే నైవేద్యాలను భగవంతుడు మంత్రపూర్వకంగా తీసుకుంటాడని అర్థం. అంతేకాని మనం పెట్టిన పిండివంటలను తినేస్తాడని కాదు. అందుకే స్వామికి నివేదించిన నైవేద్యాన్ని(offerings) ఆయన ప్రసాదంగా భక్తులందరూ(Devotees) తీసుకుంటారు.

గోళ్లు, వెంట్రుకలు ఎప్పుడు కత్తిరించుకోవాలి?

ఉదయం వేళ స్నానానికి ముందుగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో మినహా మిగిలిన ఏ రోజునైనా గోళ్లు(Nails) కత్తిరించుకోవచ్చు. వెంట్రుకలు తీయవచ్చు. వీటిని ఇంటిలో పడకుండా చూసుకోవాలి. శరీరం లోపలి నుంచి బయటకు పెరిగే ఎముకలని గోళ్లు, వెంట్రుకలను భావిస్తారు. ఎముకలు(Bones) ఇంట్లో ఉంచుకోవడం అశుభం కాబట్టి, కత్తిరించుకున్న గోళ్లు, వెంట్రుకలు ఇంటిలోపల ఉండకూడదు.

ఇవి కూడా చదవండి….

Exit mobile version