end
=
Thursday, November 21, 2024
వార్తలురాష్ట్రీయంOrgan donation:అవయవ దాతలకు డబుల్ బెడ్​రూమ్!
- Advertisment -

Organ donation:అవయవ దాతలకు డబుల్ బెడ్​రూమ్!

- Advertisment -
- Advertisment -

  • ఆర్గన్స్​దానాలకు సపరేట్​హెలికాప్టర్​
  • ప్రభుత్వానికి వైద్యారోగ్యశాఖ ప్రపోజల్
  • జిల్లాల్లోనూ అవగాహన సదస్సులు


అవయవాలు దానం (Organ donation) చేసినోళ్లకు డబుల్ బెడ్​రూమ్​(Double bedroom)ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్​చేస్తున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ (CM KCR)కు వైద్యారోగ్యశాఖ ప్రపోజల్ (Proposal of Health Department) పంపినట్లు సమాచారం. అంతేగాక పేద పిల్లలకు స్పెషల్ ​కేటగిరీ కింద గురుకులాల్లోనూ (Schools)అడ్మిషన్లు (Admission) ఇవ్వనున్నారు. ఆర్గాన్స్​డోనేషన్ల ప్రాధాన్యతను పెంచేందుకే ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇక ఆర్గాన్స్​ట్రాన్స్‌ప్లాంటేషన్ల సమయంలో అవయవ దానాల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను కూడా వాడనున్నారు. జిల్లాల్లోనూ అవగాహనా క్యాంపులు పెట్టేందుకు ఆరోగ్యశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు టీమ్‌లకు ట్రైనింగ్‌లు కూడా ఇవ్వనున్నారు. ఆర్గాన్స్​సేఫ్టీ (Organ Safety) కోసం ప్రతి ఆసుపత్రిలో స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. నోడల్​కేంద్రంగా గాంధీ ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. ఏకంగా 9 ట్రాన్స్​ప్లాంటేషన్​థియేటర్లను సిద్ధం చేశారు.

ఆర్గాన్స్ కొరత:
వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, కిడ్నీ, కాలేయం, గుండె (Kidney, liver, heart) తదితర అవయవాలను కృత్రిమంగా తయారు చేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. దీంతో మరణించినోళ్ల అవయవాలను సేకరించి అవసరమైనోళ్లకు అందజేయడం కోసం జీవన్​దాన్​(Jeevandan)అనే సంస్థను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.‘అవయవాలు మట్టిలో కలిపే కంటే దానం చేయడం ఎంతో మిన్న’ (‘Donating organs is better than burying them in soil’)అనే ప్రచారంతో ఆర్గాన్స్‌ను సేకరిస్తున్నారు. బ్రెయిన్‌ డెడ్‌ (BRAIN DEAD)అయిన వ్యక్తి నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను (Heart, liver, lungs, kidneys, pancreas, skin, cornea, bone tissue, heart valves, blood vessels) సేకరించి అవసరమైన రోగులకు దానం చేస్తున్నారు. 2013లో ప్రారంభమైన జీవన్‌దాన్‌ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 1,142 మంది నుంచి 4,316 ఆర్గాన్స్‌ సేకరించి, అవసరం ఉన్న వారికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మరో 3,180 మంది ఆర్గాన్స్‌ కోసం రిజిస్ర్టేషన్ చేసుకుని ఎదురు చూస్తున్నారన్నారు. కరోనా నుంచి ఆర్గాన్స్​డోనేట్ చేసే వాళ్ల సంఖ్య మరింత తగ్గింది. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అండగా ఉండటం వలన ఆర్గాన్​డోనేషన్‌కు ప్రజలు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తున్నది.

(Sanitary pads:బాలికలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్)

చేతులెత్తి మొక్కుతున్నా: హరీష్​రావు
‘బ్రెయిన్​డెడ్​అయినోళ్ల నుంచి అవయవాలు సేకరించేందుకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. సమాజంలో వారికి గుర్తింపు నివ్వాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఆర్గాన్​డోనేషన్లు పెరుగుతాయి. దీనిలో భాగంగానే నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌ (Gandhi Hospital)లో 162 మంది ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులను సన్మానించాం. పుట్టెడు దు:ఖంలోనూ అమయవ దానానికి ఒప్పుకుని, ఇంకొకరికి ప్రాణదానం చేసినవారందరూ ఎంతో స్ఫూర్తిదాయకం’ అంటూ హారీష్ రావు (Harish rao) చెప్పుకొచ్చారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -