end

డబుల్‌ బెడ్రూం ఇల్లు తిరిగిచ్చేసింది..

సిద్దిపేట జిల్లా: తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా అమలు చేస్తున్న పథకం డబుల్‌ బెడ్రూం ఇండ్లు. రాష్ట్రంలో చాలా మంది పేదలు, మధ్య తరగతి జనం ఆ ఇళ్లు తమకు దక్కాలని ఆశిస్తున్నారు. కానీ, లక్ష్మీ అనే మహిళ తనకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని తిరిగి ఇచ్చేసింది. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఇంట్లో తాను, తన కుమార్తె మాత్రమే ఉంటామని, ప్రస్తుతం తాము తన సోదరుని ఇంట్లో ఉంటున్నామని చెప్పింది.

తన కూతురుకు వివాహం జరిగితే తాను ఒంటరిదాన్ని అవుతానని, ఒంటరిగా ఉండలేను కాబట్టి.. తన సోదరుని వద్దే ఉంటానంది. తనకిచ్చిన ఇల్లు మరో పేద మహిళకు ఇస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇంటిని తిరిగి ఇచ్చేస్తున్నానని లక్ష్మీ తెలిపింది. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి హరీష్ రావు అభినందించారు. అందరూ లక్ష్మిలా ఆదర్శవంతగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెను జిల్లా కలెక్టర్, ఛైర్మన్ శాలువ కప్పి సన్మానించారు.

Exit mobile version