end
=
Saturday, September 21, 2024
వార్తలుజాతీయందేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం
- Advertisment -

దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం

- Advertisment -
- Advertisment -

దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ద్రౌపది చేత రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఓ తెలుగు సీజేఐ రాష్ట్రపతి చేత ప్రమాణస్వీకారం చేయించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం త్రివిధ దళాలు 21 గన్‌ సెల్యూట్‌తో ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు, పార్లమెంటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు చదువుకోవడం నా కల ఇప్పుడు నేను రాష్ట్రపతిని అయ్యాను. నా ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీక. రాష్ట్రపతిగా ఎన్నికవడం నా అదృష్టం. అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడతాను. ఓ సాధారణ ఆదివాసీని దేశ అత్యున్నత స్థానంలో నన్ను నిలబెట్టారు.

మీ విశ్వాసం నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తాను. వచ్చే 25 ఏళ్లలో దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, హక్కులకు ప్రతీక అయిన పార్లమెంటులో ఇలా నిల్చోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దేశ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మీ నమ్మకం, మద్దతుతోనే ఈ కొత్త బాధ్యతలను నిర్వర్తించగలను. స్వతంత్ర భారతావనిలో పుట్టిన తొలి రాష్ట్రపతిగా నేను నిలిచాను. నాకు చాలా సంతోషం గా ఉంది. మన దేశ స్వతంత్ర పోరాట యోధుల విశ్వాసాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాను. రాష్ట్రపతి వరకు చేరుకోవడం నా వ్యక్తిగత విజయం కాదు. ఇది దేశంలోని పేద ప్రజల విజయం. పేదలు కలలు కనడమే కాదు ఆ కలలను సాకారం కూడా చేసుకోగలరు అనడనానికి నా విజయమే ఒక నిదర్శనం.

ఎన్నో దశాబ్దాలుగా అణగారిన వర్గాలైన పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. నన్ను మీ ప్రతినిధిగా చూడండి. ఎన్నో కోట్ల మంది మహిళల ఆకాంక్షలు, కలలకు నా ఎన్నిక ఓ ప్రతీక. మరికొద్ది రోజుల్లోనే మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్నాం. భారత్ 50వ స్వాతంత్ర్య వేడుకల ఏడాదే నా రాజకీయ జీవితం మొదలైంది. ఇప్పుడు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ నాకీ గొప్ప అవకాశం లభించింది. ఆమె తొలి సందేశం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది.

పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.

జులై 25 సెంటిమెంట్

రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణ స్వీకారం చేసిన పదో వ్యక్తి ద్రౌపదీ ముర్ము. 1977లో నీలం సంజీవ రెడ్డి జులై 25న రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఆయన పూర్తికాలం పదవిలో ఉండటంతో అప్పటి నుంచి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించినవారంతా అదే తేదీన బాధ్యతలు చేపడుతుండటం సంప్రదాయంగా జరుగుతు వస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -