end
=
Friday, November 22, 2024
వార్తలుఅంతర్జాతీయందుబాయ్‌లో గణేష్‌ ఉత్సవాలు
- Advertisment -

దుబాయ్‌లో గణేష్‌ ఉత్సవాలు

- Advertisment -
- Advertisment -

పాల్గొన్న ప్రవాస భారతీయులు

ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు హిందూ పండగలను వైభవంగా జరుపుకుంటున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. వినాయక చవితి పండగను పురస్కరించుకుని దుబాయ్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్నారై పెంతల ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. బుధవారం దుబాయ్ లోని బార్ దుబాయ్ పట్టణంలో గల సముద్రతీరంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

కళాశాల, వర్సిటీల పరీక్షలు నిర్వహించాల్సిందే !

అనంతరం పెంతల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగరీత్యా తాము బయట దేశాలలో ఉన్నప్పటికి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనునిత్యం గౌరవిస్తూ హిందూ పండుగలను గొప్పగా జరుపుకోవడం బాధ్యతగా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఏడు గణపతి పండగను దుబాయ్ లో ఘనంగా నిర్వహిస్తామని, ఎప్పటిలాగే ఈసారి కూడా స్వామి వారికి ప్రత్యేక పూజలు అందించి నిమజ్జనం చేశామని తెలిపారు. ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ యావత్ మానవాళికి జీవనోపాధి లేకుండా చేసిన కరోనా వ్యాధి త్వరగా అంతం కావాలని విజ్ఞేశ్వరుణ్ణి కోరుకున్నట్లు పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -