ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్..
గత నెల 9న నామినేషన్ల స్వీకరణతో ప్రారంభమైన దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నిక ప్రక్రియలో మంగళవారం జరిగిన పోలింగ్‌తో కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుండగా ప్రచారం తీరుతెన్నులను పోలింగ్ సరళి, గెలుపోటములపై ప్రధాన రాజకీయ పక్షాలు విశ్లేషణ జరుపుకుంటున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామనే ధీమా టీఆర్‌ఎస్ శిబిరంలో కనిపిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాయి.
ఏపి, తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం ఒకే
ఈ ఏడాది ఆగస్టు 6న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ నుంచి దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు సహా మొత్తం 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలోకి దిగారు.
దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
నామినేషన్ల షెడ్యూల్‌కు ముందే టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ పోటాపోటీ ప్రచారపర్వంలో అడుగుపెట్టగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఖరారులో కొంత ఆలస్యం చేసింది. టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలను ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఒంటిచేత్తో నిర్వహించగా కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార సారథ్యం వహించారు.