end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంభూ నిర్వాసితులపై దుబ్బాక ఎమ్మెల్యే ఆగ్రహం
- Advertisment -

భూ నిర్వాసితులపై దుబ్బాక ఎమ్మెల్యే ఆగ్రహం

- Advertisment -
- Advertisment -

తొగుట: భూ నిర్వాసితులపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంచిగా మాట్లాడితే డబ్బులు వస్తయి.. లేకుంటే రావు.. పోయి ఆర్డీవోను అడుక్కోపోండి. సమస్యలు తెలుసుకుందామని మీ దగ్గరి వస్తే, నన్నే బెదిరిస్తరా..’ అంటూ ఎమ్మెల్యే రఘునందన్‌రావు భూ నిర్వాసితులపై కోపగించుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన బ్రాహ్మణ బంజరుపల్లి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇప్పటి వరకు తమకు పూర్తి పరిహారం అందలేదని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు స్ట్రక్చర్‌ వాల్యూ చెక్కులు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే 2019 ఫిబ్రవరి 6ను ప్రభుత్వం కట్‌ ఆఫ్‌ తేదీగా నిర్ణయించిందని వారికి వివరించారు. అర్హులైనవారికి పరిహారం అందేలా కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కొందరు గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఊళ్లో లేనోళ్లకు, సచ్చిపోయినోళ్లకు సైతం పరిహారం చెక్కులు ఇచ్చి.. తమకెందుకు ఇవ్వరని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో వారిపై ఎమ్మెల్యే కళ్లెర్రజేశారు. న్యాయం చేస్తానని చెప్పాక కూడా ఇలా మాట్లాడడం ఏ మాత్రం సమజసం కాదని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -