end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీPlanet Killer:‘ప్లానెట్ కిల్లర్’తో భూమికి ప్రమాదమే..
- Advertisment -

Planet Killer:‘ప్లానెట్ కిల్లర్’తో భూమికి ప్రమాదమే..

- Advertisment -
- Advertisment -
  • సూర్యకాంతి వెనక గుర్తించిన శాస్త్రవేత్తలు
  • ఏదో రోజు భూమిని ఢీకొట్టే చాన్స్ ఉందని వెల్లడి


శాస్త్రవేత్తలు (Scientists)సూర్యుని కాంతి (Sun light)లో దాగివున్న ‘ప్లానెట్ కిల్లర్’(‘Planet Killer’) ఆస్టరాయిడ్‌ (Asteroid)ను తాజాగా కనుగొన్నారు. ఇది ఏదో రోజు భూమిని ఢీకొట్టే అవకాశం (Chance of hitting the ground) ఉందని వారు భావిస్తున్నారు. 1.5-కిలోమీటర్ల (km) వెడల్పు (width)గల ఈ భారీ గ్రహశకలం (Asteroid) గత ఎనిమిదేళ్లలో (8 years)గుర్తించబడిన అత్యంత ప్రమాదకరమైన గ్రహశకలంగా గుర్తించారు. ఇక పరిమాణం కారణంగా శాస్త్రవేత్తలు దీన్ని ‘కిల్లర్ ప్లానెట్’ అని పిలుస్తున్నారు. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటే పలు ఖండాల్లో జీవం నాశనమయ్యే ప్రమాదముంది.

ఈ ప్లానెట్ కిల్లర్‌కు అధికారికంగా ‘2022 AP7’ అని నామకరణం చేశారు. ఇది భూమి, శుక్రుడి మధ్య (Between Earth and Venus)ప్రాంతంలో కక్ష్యలో ఉన్నందున చాలా కాలం పాటు గుర్తించబడలేదు. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో అంతరిక్ష వస్తువులను కనుగొనాలనుకుంటే, వారు నేరుగా సూర్యుని వైపు చూడాలి. ఇక సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కనుక దేన్నయినా అంచనా వేయడం కష్టం. ‘సూర్య కాంతిని గమనించడం కష్టం కాబట్టి భూకక్ష్యలో పూర్తి కక్ష్యలతో ఉన్న సుమారు 25 గ్రహశకలాలు మాత్రమే ఇప్పటి వరకు కనుగొనబడ్డాయి’ అని కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ సైన్స్‌ (Carnegie Institution for Science)కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త స్కాట్ ఎస్. షెపర్డ్ (Astronomer Scott S. Shepherd)చెప్పారు. ఇప్పటి వరకు భూమికి సమీపంలో ఉన్న రెండు పెద్ద గ్రహశకలాలను కనుగొన్నామని తెలిపిన షెపర్డ్.. ఒక కిలోమీటరు మేర వ్యాపించిన ఈ ఆస్టరాయిడ్స్‌ను తాము ప్లానెట్ కిల్లర్స్ అని పిలుస్తామని వెల్లడించారు.

చిలీలోని (Chile) సెర్రో టోలోలో ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీ (Inter-American Observatory at Cerro Tolo) వద్ద సెన్సిటివ్ డార్క్ ఎనర్జీ కెమెరా(Sensitive dark energy camera) (DEC) కారణంగా ఈ ఆవిష్కరణ సాధ్యమైంది. ప్రతిరోజూ సంధ్యా సమయంలో 10 నిమిషాల వ్యవధిలో ఈ గ్రహశకలాలు గుర్తించబడినప్పుడు ఈ కెమెరా ఆకాశాన్ని స్కాన్ (Scan the sky) చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం, దాదాపు 2,200 ప్రమాదకరమైన గ్రహశకలాలు, అంతరిక్ష శిలలు భూమికి ప్రమాదకరమైన కక్ష్యలో ఉన్నాయి. ఇవి 1 కిలోమీటరు కంటే వెడల్పు ఉన్నాయి. అలాంటి గ్రహశకలాలు భూమిపై విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. అయితే 50 మీటర్ల కంటే తక్కువ వెడల్పయిన గ్రహశకలాలు కూడా మొత్తం నగరాలను నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.

(Horse: గుర్రాలకు బూట్లు..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -