end

Dark Chocolate:డార్క్‌ చాక్లెట్‌తో మతిమరుపు దూరం

Dark Chocolate:మతిమరుపు (amnesia)… వయస్సుపైబడిన వారిలో ఇదో సమస్య. ప్రతీది మరిచిపోతుంటారు వయో వృద్ధులు. మనుషులను గుర్తుపెట్టుకోకపోవడం, సమయానికి మందులు వేసుకోలేకపోడం, ఆ మందుల పేర్లు, ఎప్పుడు వేసుకోవాలనే సమయాన్ని మరిచిపోతుంటారు. ఈ సమస్యని అల్జీమర్స్‌(Alzheimer) అని కూడా అంటారు. ఈ మధ్య మధ్యవయస్కుల వారిలో కూడా కనబడుతోంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి(Mental Stress), సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత నిద్రలేకపోవడం వల్ల కూడా మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన పోషకాలు అందక, విటమిన్స్‌, ప్రోటీన్స్‌ తక్కువ అవడం వల్ల తొందరగా మతిమరుపు బారిన పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ మధ్యకాలంలం 35 ఏళ్ల వయస్సులోనే అల్జీమర్స్‌, డిమెన్షియా బారిన పడిన వారు కూడా చలా మంది ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే దీనికి కారణం ప్రస్తుత జీవిత విధానం, ఆహారపు అలవాట్లు(Food Habits), విశ్రాంతి లేకుండా పనిచేయడం, నిద్రలేమితనం, ముఖ్యంగా రాత్రుళ్లు ఉద్యోగాలు చేయడం వంటివి ముఖ్యమైన కారణాలుగా చెప్పవచ్చు.

అయితే డార్క్‌ చాకెట్లు తినడం వల్లన కొంతమేర వ్యాధి నుండి బయటపడవచ్చని తెలుస్తోంది. వారానికొకసారైన డార్క్‌ చాకెట్లు తినడం వల్లన అందులోని ఫ్లెవనాల్‌, కోకో పోషకాలు(Cocoa Nutrients) జ్ఞాపకశక్తిని పెంచుతాయని ఇటలీలోని యూనివర్సిటీ ౠఫ్‌ ఎల్‌ అక్విలా(University of L Aquila)కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్‌ గియోవాబాటిస్టా దేసిదెరి చెబుతున్నారు. ఇదే గాకుండా చాక్లెట్‌ డ్రింక్‌ తీసుకోవడం వల్ల రక్తపోటు(Blood Pressure) అదుపులో ఉంచుకోవచ్చుని తెలిపారు. అయితే చక్కెర వ్యాధి ఉన్న వారు డాక్టర్ల సలహా మేరకు ఈ డార్క్‌ చాక్లెట్లు తీసుకోవడం మంచిదని వివరించారు.

Exit mobile version