end
=
Wednesday, January 22, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంPlums: వర్షాకాలంలో ఆలూ బుఖారాను తినడం మంచిదా....
- Advertisment -

Plums: వర్షాకాలంలో ఆలూ బుఖారాను తినడం మంచిదా….

- Advertisment -
- Advertisment -

Plums: ఆలూ బుఖారా చాలా ప్రసిద్ధ, పోషకమైన మరియు రేయినీ సీజన్లో (Monsoon) సమృద్ధిగా దొరికే పండు ఇది చాలా తీపి మరియు జ్యుసి గా ఉంటుంది, మరియు ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే ఇది వారి ఆరోగ్యాన్ని బలంగా మరియు శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆలూ బుఖారా(Al Bhukara) అనేది రుచికరమైనది మాత్రమే కాకుండా మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్న పండు. ఇది గులాబీ, ఊదా, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మరియు నారింజ వంటి విభిన్న రంగులలో పెద్దది నుండి చిన్నది వరకు వివిధ రూపాల్లో ఉంటుంది. ఈ పండ్లను తాజాగా లేదా ఎండబెట్టి తినవచ్చు. ప్లమ్స్ యొక్క ఎండిన రూపాన్ని ప్రూనే అంటారు. మలబద్ధకం మరియు బోలు ఎముకల వ్యాధి చికిత్సలో ఇవి ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటాయి.

(Thippa Teega: తిప్పతీగలో ఎన్నో అద్భుతమైన గుణాలు)

మధుమేహం(Diabetics) లేదా షుగర్ ఉన్నవాళ్లు ఆల్ బుఖారా పండ్లను ఈ సీజన్ లో ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఈ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దాని వల్ల శరీరంలోని రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో పొటాషియం లాంటి మినరల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి అవి కాపాడుతాయి. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది శరీరంలోని కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే బోరాన్ ఎముకలను ధృడంగా చేస్తుంది. అలూ బుఖారా పండ్లలో ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్లు, నియోక్లోరోజెనిక్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి క్యాన్సర్ నిరోధక ఏజెంట్లను అధికంగా కలిగి ఉంటుంది. ఈ ఫినాల్స్ ఆరోగ్యకరమైన కణాలకు హాని కలిగించకుండా, రొమ్ము క్యాన్సర్ కణాలను చంపేస్తాయి.

(chia seeds : చియా విత్తనాలు…ఆరోగ్య ర‌హ‌స్యాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -