- WHO చీఫ్ టెడ్రోస్ ప్రపంచ దేశాలకు సూచన
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఆర్థికంగా పుంజుకుంటున్నాయి. ఇది మంచి పరిణామమే అయినా కరోనా వైరస్‌ను అంత తేలికగా తీసుకోరాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి 8 నెలల నుండి కొనసాగుతుందని, ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా 100 శాతం అంతమైనట్లు నిర్ధారించుకోరాదని వివరించారు. దీనివల్ల ప్రతీ ఒక్కరి ఆరోగ్యం మీద దెబ్బపడిందని WHO చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు.
వేగంగా వెళ్ళొద్దనందుకే చితకబాదరు..
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు సీరియస్‌గా ఉండాలని వివరించారు. కరోనా వైరస్‌ను నియత్రించిన తర్వాత వ్యాపార కలాపాలు మొదలు పెట్టడం మంచిదని, ఎటవంటి సురక్షితమైన చర్యలు తీసుకోకుండా, వైరస్ వ్యాప్తిని నియత్రించకుండా వ్యాపారాలు మొదలు పెడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని టెడ్రోస్ హెచ్చరించారు.