end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంజనవరి 31 వరకు విద్యా సంస్థలు బంద్‌ !
- Advertisment -

జనవరి 31 వరకు విద్యా సంస్థలు బంద్‌ !

- Advertisment -
- Advertisment -
  • ఒమిక్రాన్‌ వైరస్‌ విజృంభన
  • రెండు రోజుల్లో విద్యాశాఖ ప్రకటన

తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తుండడంతో ప్రతీ రోజు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇదేగాకుండా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కూడా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ విద్యా సంస్థల విషయంలో సెలవులను పొడగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త వేరియంట్ ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతున్నట్లు డాక్టర్లు చెబుతుండడంతో రాష్ర్ట ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. థర్డ్‌ వేవ్‌ ముంచుకొస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళాశాలలు, పాఠశాలలకు ఈ నెల 31 వరకు సెలవులు పొడగించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విద్యాశాఖ నుండి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది. అయితే విద్యా సంస్థలు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -