గజ్వేల్(Gajwel): సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో నిర్వహించిన పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు(Harish Rao). ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ , ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, హాజరయ్యారు.
మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఉపాధ్యాయులందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది.సమాజాన్ని మంచి దారిలో నడిపించే మేధావులు ఉపాధ్యాయులు.పి ఆర్ టి యు టి ఎస్ సంఘ గౌరవాన్ని పెంచే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) గారు చూసుకున్నారు.సమాజంలో అబద్దాలను వ్యాప్తింప చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి వారికి నిజాలు తెలవాలన్న పాలకులలో తేడా తెలవాలంటే సమాజంలో చర్చ జరగాలి. తెలంగాణ(Telangana)లో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే నిజాలు మన కళ్ళముందే ఉంటాయి. ప్రతి రంగంలో అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ.మంచిని చెడును విశ్లేషించిన నాయకత్వం కలిగిన ఉపాధ్యాయులు ఈరోజు సమాజానికి నిజాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయాలి.తెలంగాణలో విద్యను పట్టించుకోవట్లేదని కొంతమంది కోహన మేధావులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.వైద్య ఆరోగ్యశాఖలో అనేక వైద్య విద్య కోర్సులు(Medical education courses) ఉంటాయి డాక్టర్లు నర్సులు బీఫార్మసీ ఎం ఫార్మసీ దంత వైద్యము కోర్సులు ఇట్లా అనేకమైన కోర్సుల్లో విద్యని రాష్ట్రంలో అందరికీ అందించాలని ముందుకు వెళుతున్నాను.
(Bandi sanjay:ఫ్రస్టేషన్‌తోనే బరితెగిస్తున్నారు)
రాష్ట్రం వచ్చిన నాదు ఎంబిబిఎస్ సీట్లు 850 మాత్రమే ఉంది అది ఇప్పుడు 2950కి పెరిగినయ్ అంటే అది కేవలం ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుచూపు వల్లే సాధ్యమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా గాంధీ కాకుండా మూడే మూడు మెడికల్ కాలేజ్ తో తెలంగాణ వివక్ష గురైంది , కానీ ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్(Medical College) లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ క్రమంలో ఇప్పటివరకు 12 తన మెడికల్ కాలేజీ ప్రారంభించి రాష్ట్రంలో ఈరోజు మెడికల్ కాలేజ్ సంఖ్య 17 కు చేరింది . దేశంలో ఎక్కడలేని విధంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నాం వచ్చే సంవత్సరం ఈమరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నాం.రాష్ట్రం వీలు పడ్డప్పుడు రెసిడెన్షియల్ స్కూల్(Residential School) సంఖ్య 295 రెసిడెన్సి స్కూల్ మాత్రమే ఉంది ఈరోజు 920 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. 2014 లో లక్ష పన్నెండు వేల మంది విద్యార్థుల ఉండే ఇపుడు నాలుగు లక్షల 46వేల మంది పిల్లలకు బోధన అందిస్తున్నాం.2014లో విద్యపై చేసిన ఖర్చు 9518 కోట్లు ఇప్పుడు 25250 కోట్లు విద్య పైన ఖర్చు పెడుతున్నాం .రాష్ట్ర బడ్జెట్లో పది శాతం కేవలం విద్య పైన ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ.
మన ఊరి మనబడి ద్వారా అన్ని పాఠశాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.GSDP 2014 లో 124000 రూపాయలు ఈ సంవత్సరం మన తలసరిగా 2,75,000 రూపాయలకు పెరిగింది దేశ జిడిపి ఇప్పటికి మనకంటే తక్కువనే 1,50,000 ఉంది .వ్యవసాయ రంగం తెలంగాణలో ఊహించలేనంత అభివృద్ధి చెందింది భూమి కి బరువైనంత పంట పండుతుంటే ఒక ఎకరానికి కూడా కాలేశ్వరం నీళ్లు ఇవ్వలేదు అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ అర్థం లేనిది.కాలేశ్వరం(Kaleswaram) నీళ్ళు రానిదే ఈరోజు తెలంగాణలో పండిన పంట కొనలేనంత బరువు కేంద్రానికి ఎందుకయింది.2014 నాటికి సాగు విస్తీర్ణం కోటి 34 లక్షల ఎకరాలు కాగా, నేడు అది 2 కోట్ల మూడు లక్షల ఎకరాలకు చేరింది. ఇది కాకుండా 11.50 లక్షల ఎకరాలకు ఉద్యానపంటలు సాగు విస్తీర్ణం పెరిగింది. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే కాగా, 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది.
(Chandrababu Naidu:సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి)
అన్ని పంటల ఉత్పత్తి కలిపి 3.50 కోట్లకు చేరుకుంది.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయనికి బయలు అకడ మీటర్లు పెట్టలేదని ఈ సంవత్సరం 6000 కోట్లు ఆపింది , ఎఫ్ ఆర్ బి ఎం కింద 15000 కోట్లు ఆపింది మొత్తం 21 వేల కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంది . అందుకే ఈరోజు రాష్ట్రంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందర్నీ కడుపులో పెట్టుకొని కాపాడుకునే నాయకుడు ఎవరికి కష్టం రాకుండా చూసుకుంటారు.ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్(Recruitment) పై ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు కాబట్టి త్వరలో ఉపాధ్యా రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాం.ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇలాంటి సమస్య వచ్చినాయి ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరించింది ఇకపై కూడా ఇలాంటి సమస్యలు ఉన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం.త్వరలో ఎంప్లాయిస్ హెల్త్ కార్డు విషయం లో నిర్ణయం తీసుకోబోతున్నాం.