end
=
Saturday, February 22, 2025
వార్తలురాష్ట్రీయంఎలక్ట్రిక్‌ బైక్‌ పేలి వ్యక్తి మృతి
- Advertisment -

ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలి వ్యక్తి మృతి

- Advertisment -
- Advertisment -

ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలి కుటుంబ పెద్ద మృతి చెందిన సంఘటన విజయవాడలోని సూర్యరావుపేటలో జరిగింది. శివకుమార్‌ అనే వ్యక్తి కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలు చేశారు. ఇంట్లో బెడ్‌రూమ్‌లో బైక్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోయారు. అయితే తెల్లవారుజామున బైక్‌ బ్యాటరీ పేలి ఇంట్లో పూర్తిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ దుర్ఘటనలో కుటుంబ పెద్ద శివకుమార్‌ మృతి చెందారు. భార్యా పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఇంటి తలుపు పగులగొట్టి వారిని ఆసుపత్రికి తరలించారు. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.

ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలడం వల్ల ఇంట్లో కుట్టు మిషన్‌ కాలిపోయిన దృశ్యం…
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -