end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంసెల్‌ఫోన్‌తో విద్యుత్‌ షాక్‌ - యువకుడు మృతి
- Advertisment -

సెల్‌ఫోన్‌తో విద్యుత్‌ షాక్‌ – యువకుడు మృతి

- Advertisment -
- Advertisment -
  • మొబైల్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టి మాట్లాడుతుండగా ఘటన

మొబైల్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టి మాట్లాడొద్దు అని ఎన్నిమార్లు హెచ్చరించినా ఎవరూ పట్టించుకోరు. మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడుతున్న ఓ యువకుడికి షాక్‌ కొట్టి మృతి చెందిన సంఘటన శంకర్‌పల్లి మండలంలో జరిగింది. ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం…. అసోం రాష్ర్టానికి చెందిన యువకుడు భాస్కర్‌ జ్యోతినాథ్‌(20) బతుకుదెరువు కోసం శంకర్‌పల్లికి వచ్చాడు. రెండేళ్లుగా స్థానికంగా ఎక్ర్టిషియన్‌గా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సోమవారం రాత్రి తన గదిలో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. అకస్కాత్తుగా షాక్‌ తగలడంతో భాస్కర్‌ చేతులు, చెవి భాగం కాలిపోయింది. స్థానికులు, స్నేహితులు ఇది గమనించి శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే భాస్కర్‌ జ్యోతినాథ్‌ మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -