end
=
Tuesday, January 21, 2025
వార్తలుఅంతర్జాతీయంసహోద్యోగితో సహజీవనం... మరో ఇద్దరు పిల్లలకు తండ్రైన ఎలాన్‌ మస్క్‌?
- Advertisment -

సహోద్యోగితో సహజీవనం… మరో ఇద్దరు పిల్లలకు తండ్రైన ఎలాన్‌ మస్క్‌?

- Advertisment -
- Advertisment -

టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ మరోసారి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. తన కంపెనీలో పనిచేస్తున్న సహోద్యోగిని శివోన్‌ జిలిస్‌తో గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నాడు. దీంతో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పత్రిక పేర్కొంది. అయితే మస్క్‌, జిలిస్‌ గత ఏప్రిల్‌లో తమ పిల్లల పేర్లకు తమ చివరి పదాన్ని చేర్చేలా కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి కోర్టు పత్రాల ద్వారా బిజినెస్‌ ఇన్‌సైడర్‌ వెల్లడించింది. కోర్టు ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది.

ఎలాన్‌ మస్క్‌కు ఇప్పటికే తన మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌ ద్వారా ఐదురుగురు పిల్లలకు జన్మనిచ్చారు. కెనెడా సింగర్‌ గ్రైమ్స్‌తో కూడా ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు. ఎలాన్‌మస్క్‌ స్థాపించిన న్యూరాలింక్‌ కంపెనీలో జిలిస్‌ ఆపేరేషన్స్‌ అండ్‌ స్పెషల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. మే 2017లో ఆమె ఈ కంపెనీలో చేరారు. ఇదేగాకుండా టెస్లాలో ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి డైరెక్టర్‌గా కూడా ఎంపికైనట్లు జిలిస్‌ లింక్డిన్‌ ఖాతా ప్రకారం తెలుస్తోంది. అదేగాకుండా ఓపెన్‌ఎఐలో కూడా ఆమె బోర్డు మెంబరుగా వ్యవహరిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -