- ట్విటర్ కొనుగోలు ఒప్పందం రద్దు
- ఎలాన్‌మస్క్‌పై న్యాయపరమైన చర్యలకు ట్విటర్ సిద్దం
ఎలాన్‌మస్క్, ట్విటర్ మధ్య యుద్దం కొనసాగుతోంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ సంస్థకు భారీ షాక్ ఇచ్చారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఎలాన్ తెలిపారు. అయితే ట్విట్టర్ సంస్థ స్పందిస్తూ ఎలాన్‌మస్క్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్లు ట్విటర్ బోర్డు చైర్మన్ బ్రెట్ టేలర్ తెలిపారు. సుమారు 44 బిలియన్ డాలర్లకు ఏప్రిల్ నెలలో ఎలాన్‌మస్క్ ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నారు. కానీ ట్విటర్‌లో ఫేక్ అకౌంట్‌ల గురించి ట్విటర్ పూర్తి సమాచారాన్ని ఇవ్వడం లేదని మస్క్ ఆరోపిస్తున్నారు. స్పామ్ యూజర్లు ఎంతమంది ఉన్నారో, అది కేవలం 5 శాతం లోపు ఉండాలని ఆయన సూచించారు. ట్విటర్ ఈ సమాచారాన్ని సరైన విధంగా ఇవ్వడం లేదని అందుకే ట్విటర్ కొనుగోలు డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు మస్క్ వివరించారు. అయితే ఒప్పందం ప్రకారం ఎలాన్‌మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయకపోతే బ్రేక్-ఆఫ్ ఫీజు కింద ఒక బిలియన్ డాలర్లు ట్విటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
ఇవికూడా చదవండి….