end
=
Wednesday, November 20, 2024
వార్తలుRetirement : ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ
- Advertisment -

Retirement : ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ

- Advertisment -
- Advertisment -
  • విధుల్లో ఉండగానే గుర్తింపు తెచ్చుకోవాలి

రాయపోల్ : ఉద్యోగులకు పదవి విరమణ (Retirement) తప్పనిసరి అని ఉమ్మడి మండల విద్యాధికారి నర్సమ్మ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న బయాలోజీ ఉపాధ్యాయుడు పడాల కిషన్ పదవీ విరమణ అభినందన సభకు ముఖ్యఅతిథిగా ఎంఈఓ నర్సమ్మ హాజరయ్యారు. (MEO) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాంసాగర్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ పదవి కాలం పూర్తి కావడంతో పడాల కిషన్ విద్యార్థులకు బోధించిన పాఠాలతో పాటు ఆయన విద్యార్థులకు అందించిన పలు సూచనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆమె గుర్తు చేశారు.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుందని అనుభవం కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలో పనిచేస్తున్నారని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులకు (Govt School) ప్రభుత్వ పాఠశాలలో ఎంతో వరంగా మారాయని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాంసాగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి, రాయపోల్ ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, అనాజీపూర్ ప్రధానోపాధ్యాయురాలు మేరీ నిర్మల కుమారి, రామారం ప్రధానోపాధ్యాయుడు రాజాగోపాల్ రెడ్డి, వడ్డేపల్లి ప్రధానోపాధ్యాయుడు చంద్రయ్య, బేగంపేట ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి, కుకునూరు పల్లి ప్రధానోపాధ్యాయుడు సత్తయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శైలజ, ఎంపీటీసీ లక్ష్మి, ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, శివలింగం, శ్యాంసుందర్, నాగరాజు, కనకయ్య, నరేందర్, విద్యాసాగర్, నర్సింలు గౌడ్, అనీఫ్, సీఆర్పీలు స్వామి గౌడ్, యాదగిరి, కుమార్ స్వామి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -