end
=
Thursday, November 21, 2024
సినీమాWriter Padma Bhushan:క్లైమాక్స్‌కి అందరూ కనెక్ట్ అవుతారు
- Advertisment -

Writer Padma Bhushan:క్లైమాక్స్‌కి అందరూ కనెక్ట్ అవుతారు

- Advertisment -
- Advertisment -

  • ‘రైటర్ పద్మభూషణ్‌’ ప్రయాణంపై సుహాన్

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్(Suhas Holsum) నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్(Tina Shilparaj) కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రైటర్ పద్మభూషణ్‌ ట్రైలర్‌(Trailer)కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో సుహాస్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

రైటర్ పద్మభూషణ్‌ ప్రయాణం ఎలా మొదలైయింది?
ప్రశాంత్ ‘కలర్ ఫోటో(Color Photo)’ సినిమాకి సహాయ దర్శకుడు. తర్వాత ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమా చేశాను. దానికి ప్రశాంత్ రైటర్. తను అలా పరిచయం. కలర్ ఫోటో తర్వాత ఈ కథ చెప్పాడు. చాలా ఎగ్జయిట్ అయ్యాం. నిర్మాతలు అనురాగ్, శరత్‌కి చెప్పాం. వారూ ఎగ్జయిట్ అయిన వెంటనే తెరకెక్కించారు.

అంత ఎగ్జయిట్ అయిన పాయింట్ ఏమిటి?
సినిమా అంతా చాలా ఎగ్జయిటింగా వుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌కి అందరూ కనెక్ట్(Connect) అవుతారు. రైటర్ పద్మభూషణ్‌ ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాడు. ఇందులో అనుమానమే లేదు.

రైటర్ పద్మభూషణ్‌‌లో సస్పెన్స్ ట్విస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయా?
వుంటాయి. ఫస్ట్ హాఫ్ లో రెండు, సెకండ్ హాఫ్ లో మూడు ట్విస్ట్‌లు వస్తాయి. క్లైమాక్స్‌లో ఇంకా మంచి ట్విస్ట్(Twist) వుంటుంది. ప్రతి మలుపుని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.

కొత్త దర్శకులతో పని చేయడం రిస్క్ కదా?
నేను కొత్త వాడినే కదండీ. ఛాయ్ బిస్కెట్ లో కొత్త వాళ్ళు రాసిన స్క్రిప్ట్(Script) లతోనే నాకు పేరు, అవకాశాలు వచ్చాయి. వాళ్ళ కథలు బావుంటాయి, ప్రేక్షకులకు నచ్చుతాయనే నమ్మకం ఆశతో మేము అంతా ఒక టీంగా ప్రయాణం చేస్తున్నాం.

(Jamuna:సీనియర్ నటి జమున ఇక లేరు.)

చెప్పిన టైం కంటే ముందే సెట్స్ లో ఉంటారట కదా?
కొంచెం ముందే వెళ్ళిపోతే పనులు సరైన సమయంలో జరుగుతాయి. హను రాఘవపుడి, శివ నిర్వాణ లాంటి దర్శకులతో పని చేస్తున్నపుడు ఇది అలవాటైయింది. వాళ్ళు ఉదయం ఐదు గంటలకే సెట్ లో వుంటారు. అలా వుండట వలన పనులు ఫాస్ట్ గా నడుస్తాయి. ఈ సినిమాకి అరవై రోజులు అనుకున్నాం, కానీ 43 రోజుల్లోనే పూర్తి చేశామంటే దానికి కారణం ఇదే.

ఇది మీ మొదటి థియేటర్ రిలీజ్ మూవీ.. ఇంకా విడుదల కాకముందే చాలా సినిమాలు లైన్‌లో పెట్టినట్లు వున్నారు ?తర్వాత సినిమా గీతా ఆర్ట్స్(Geeta Arts) 2 లో వస్తోంది. షూటింగ్ పూర్తయింది. తర్వాత ఆనందరావు అడ్వంచర్స్ అనే మరో సినిమా చేస్తున్నాను. అన్ని మంచి కథలు. త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులకు చూపించాలనే ఎక్సయిట్ మెంట్ వుంది.

ఈ కథకు నిర్మాతలని మీరు ఒప్పించారా లేదా దర్శకుడా?
కంటెంట్ తనదే కాబట్టి ఆ భాద్యత తనపైనే వుంటుంది. అయితే నేను ఒక సోర్స్ గా మాత్రమే వున్నాను. మా హోం బ్యానర్ కాబట్టి ఒకసారి కథ వినండనని చెప్పాను. ఈ కంటెంట్(Content) కి ఎవరైనా ఎక్సయిట్ అవుతారు. చాలా మంచి కంటెంట్. ట్రైలర్ లో చెప్పనిది ఒకటి సినిమాలో వస్తుంది. సినిమా చూసిన తర్వాత అది అర్ధమౌతుంది.

(Writer Padmabhushan:‘రైటర్ పద్మభూషణ్‌’)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -