end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంMunugode:మునుగోడు కేసీఆర్ బహిరంగ సభపై సర్వత్ర ఉత్కంఠ..
- Advertisment -

Munugode:మునుగోడు కేసీఆర్ బహిరంగ సభపై సర్వత్ర ఉత్కంఠ..

- Advertisment -
- Advertisment -

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని మునుగోడు (Munugode)  ఎప ఎన్నిక చివరి దశకు చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ (political heat)పెంచిన బై (by poll)పోల్ కు సమయం దగ్గరపడింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు భిన్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు (ఆదివారం) ముఖ్యమంత్రి కెసిఆర్  (KCR)బహిరంగ సభపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

మునుగోడ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపునకు పార్టీ (PARTY LEADERS)ముఖ్య నేతలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ పార్టీకే ఓటు (vote) వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆదివారం చండూరులో (CHANDOOR)భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మండల కేంద్రంలోని బంగారిగడ్డ (Banagari gadda) ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడక ముందే ఆగస్టు (August)20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభకు జన సమీకరణ కోసం ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో మండల ఇన్‌ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

(TRS MLA Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు … నిందితుల రిమాండ్‌)

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రాజకీయ పక్షాల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో సీఎం సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎమ్మెల్యేలకు (MLA) ఎర వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఆయన చండూరు సభలో మాట్లాడే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 20న జరిగిన సభలో కేవలం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల (Development and welfare schemes) కు సంబంధించిన అంశాల గురించి మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడారు. పరిమితమైన ముఖ్యమంత్రి.. ఆదివారం జరిగే సభలో రాజకీయ అంశాలపై స్పందించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్‌ రెడ్డి (Rajagopal Reddy) అమ్ముడు పోయినందునే ఉప ఎన్నిక వచ్చిందని ఆరోపిస్తున్న టీఆర్‌ఎస్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదనే విషయాన్ని సభ ద్వారా చెప్పే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలావుంటే.. మరోవైపు బీజేపీ (bjp)జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) సభ రద్దు కావడంతో బీజేపీ నేతలు ప్రచారంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఓటర్లను నేరుగా కలవడం ద్వారా వారిని తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొయినాబాద్ ఫామ్‎హౌస్ (form house)వ్యవహారం బీజేపీకి సంబంధం లేదని జనంలోకి తీసుకెళ్లగలిగామని కమలనాథులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 1న మహిళా గర్జన సభకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తమ అభ్యర్థి మహిళ కావడం వల్ల ఓట్లు రాబట్టేందుకు ఈ సభ మేలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి.. ఓటరు దేవుళ్లు ఏ పార్టీ అభ్యర్థిని కనికరిస్తారో..

(Wine Shops Closed : వైన్‌ షాపులు బంద్‌)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -