కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో సంచలన విషయాలు
కర్ణాటకలో అనుమానాస్పద(Suspicious Death) రీతిలో దారుణ హత్యకు గురైన మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (Ex DGP) కేసులో కీలక విషయాలు(Key points) వెలుగులోకి వచ్చాయి. 1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆస్తి తగాదాలు(Property Issues) కారణంగా భార్య పల్లవి చేతిలో హతమైనట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఆస్తి విషయమై భార్య పల్లవి భర్తతో గొడవపడింది. భర్త భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఓం ప్రకాశ్ కళ్లలో కారంపొడి కొట్టి, ఆపై కుర్చీకి కట్టేసి కత్తితో పొడిచి చంపినట్టు పోలీసులు గుర్తించారు.
భర్తను చంపేశాక.. పల్లవి తన స్నేహితురాలికి `ఆ రాక్షసుడిని చంపేశా` అని మొబైల్ నుంచి సందేశం పంపిందట ! మృతుడి కుమారుడు కార్తికేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లోతైన విచారణ చేపడుతున్నారు. హత్య వెనుక తన తల్లి పల్లవి, సోదరి కృతి ప్రమేయం ఉండవచ్చని కార్తికేశ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.