end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయంప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమం
- Advertisment -

ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమం

- Advertisment -
- Advertisment -
  • ఇంకా అపస్మారకస్థితిలోనే ప్రణబ్‌
  • ముఖ్యమైన అవయవాలు మాత్రమే పనిచేస్తున్నాయి

మాజీ రాష్ర్టపతి ప్రణభ్‌ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మధ్యనే ఆయనకు మెదడులో ఏర్పడిన అడ్డంకిని సర్జరీ ద్వారా తీసేశారు. అయితే అదే సమయంలో ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ణారణ అయ్యింది. దీంతో ఆయన పరిస్థితి మరింత విషమించి కోమాలోకి వెళ్లిపోయారు. ఇంకా అపస్మారకస్థితిలోనే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. (అచ్చెన్నాయుడికి కరోనా – ఎన్‌ఆర్‌ఐ ఆసుప్రతికి తరలింపు)

కాగా ఆయన శరీరంలో కేవలం ముఖ్యమైన కొన్ని అవయవాలు మాత్రమే స్పందిస్తున్నాయని వివరించారు. ఈ విషాధకరమైన పరిస్థితి నుండి కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయనాయకులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -