మెల్‌బోర్న్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా అనుకున్నంతగా రాణించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. ఆది నుంచే తడబడుతూ బ్యాటింగ్ చేసింది. 72.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 195 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ జో బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పది బంతులెదుర్కున్న అతడు జట్టు 10 పరుగులతో ఉండగా బుమ్రా బౌలింగ్‌లో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వేడ్(39 బంతుల్లో 30 పరుగులు; 3 ఫోర్లు)కు జతకలిసిన లబుషేన్(132 బంతుల్లో 48 పరుగులు; 4 ఫోర్లు) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కాసేపటికే మాథ్యూ వేడ్ ఔటవడంతో వారి భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం ఫుల్‌ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్‌ను అశ్విన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ట్రావిస్ హెడ్ (38), స్పిన్నర్ నాథన్ లియాన్(20) పర్వాలేదనిపించారు. కెప్టెన్ టిమ్ పైన్ 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మిగితా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఓ వికెట్ చొప్పున తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 11 ఓవర్లలో 36 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(0)ను స్టార్క్ తొలి ఓవర్లోనే ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 28 పరుగులు;5 ఫోర్లు), ఛటేశ్వర్ పుజారా(23 బంతుల్లో 7 పరుగులు; 1 ఫోర్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆసీస్ కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా వికెట్ తీయలేకపోయారు. రెండో రోజు తొలి రెండు సెషన్ల పాటు భారత్ పూర్తిగా బ్యాటింగ్ చేయగలిగితే పటిష్ట స్థితికి చేరుకుంటుంది.