end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంఆర్‌బిఐ గవర్నర్‌ పదవీకాలం పొడగింపు
- Advertisment -

ఆర్‌బిఐ గవర్నర్‌ పదవీకాలం పొడగింపు

- Advertisment -
- Advertisment -

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి కేబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌10తో గవర్నర్‌గా ఆయన పదవీకాలం ముగియనుంది. కరోనా సంక్షోభ సమయంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంతో కీలక చర్యలు చేపట్టారు. వడ్డీ రేట్లను తగ్గిస్తూ ద్రవ్యపరపతి విధానంలో సర్దుబాటు కొనసాగించారు. ప్రభుత్వ ఉద్దీపనలతోపాటు ఆర్‌బిఐ తరపున దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చాలా చర్యలు తీసుకున్నారు. 1980 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన శక్తికాంతదాస్‌ గతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా పని చేశారు. 2016లో నోట్ల రద్దు సమయంలో కూడా కీలకంగా వ్యవహరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -