- మెదక్ జిల్లా ముస్లాపూర్‌లో దారుణం
- కుల పెద్దలు రూ.3 లక్షలు డిమాండ్
కుల బహిష్కరణకు గురై మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడు గతంలో హత్య కేసులో ఆరు సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. శంకర్ జైలులో ఉండగానే అతని కుటుంబాన్ని కులం నుండి బహిష్కరించినట్లు తెలిసింది. శిక్ష పూర్తయి ఇంటికి తిరిగి వచ్చిన శంకర్‌కు ఈ విషయం తెలియడంతో తమ కుటుంబాన్ని కులంలోకి అనుమతించాలని కుల పెద్దలకు విన్నవించగా అందుకు రూ.3 లక్షలు చెల్లించాలని కుల పెద్దలు డిమాండ్ చేశారు. దీంతో ఎటూ తోచని శంకర్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.