end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయంరైతులే దేశానికి వెన్నెముక: ప్రధాని
- Advertisment -

రైతులే దేశానికి వెన్నెముక: ప్రధాని

- Advertisment -
- Advertisment -

వారణాసి: రైతులే దేశానికి వెన్నెముక అని, రైతు ప్రగతే దేశ ప్రగతని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెరుగుతున్న కనెక్టివిటీ సేవల వల్ల రైతులకు మేలు జరుగుతోందని అన్నారు. వారణాసి పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వారణాసిలో జరిగిన సుందరీకరణతో పాటు కనెక్టివిటీ సేవలు విపరీతంగా పెరిగాయన్నారు. దానివల్ల ఇప్పుడు ఎంతో లాభం చేకూరుతోందని మోదీ అన్నారు. హైవేలు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల సంఖ్య పెరగడం, పలు చోట్ల రోడ్లను వెడల్పు చేయడం వల్ల ట్రాఫిక్ జాం సమస్య గణనీయంగా తగ్గిందన్నారు.

గత కొన్నేళ్లుగా గ్రామాల్లో ఆధునిక గోడౌన్‌లు నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూ.లక్ష కోట్ల వరకు నిధులు కూడా ఏర్పాటు చేశామన్నారు ప్రధాని. వారణాసిలో పెరిషబుల్ కార్గోను ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి రైతులు ఎంతో లాభపడుతున్నారని, తమ పంటలను నిల్వ చేసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధాని అన్నారు. ఈ స్టోరేజీ సౌకర్యం ఏర్పాటైన తరువాత వారణాసిలో సాగు స్థాయి గణనీయంగా పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -