end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంసింగూరుపై రైతుల్లో కొత్త ఆశలు
- Advertisment -

సింగూరుపై రైతుల్లో కొత్త ఆశలు

- Advertisment -
- Advertisment -
  • కొనసాగుతున్న వరద నీరు…
  • రెండేళ్ల తరువాత చేరుతున్న వరద నీరు…
  • రెండు వారాల్లో 2 టీఎంసిలకు పైగా వరద నీరు
  • ప్రాజెక్టు లో 2.500 టీఎంసీల నీరు..
  • ప్రాజెక్టు నిండితే 126 చెరువులు… 48 వేల ఎకరాల కు సాగుకు భరోసా

సింగూరు ప్రాజెక్టు పై రైతులు పెట్టుకున్న ఆశలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. గత పది రోజులుగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, పది రోజుల క్రితం ప్రాజెక్టులో0.676 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, వరదల కారణంగా రెండు టిఎంసిల నీరు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 2.500 టీఎంసీల నీరు నిల్వకు చేరింది. గత రెండేళ్లుగా ప్రాజెక్టులోకి నీరు రాకపోవడంతో సింగూర్ పై ఆధారపడిన రైతులు నామమాత్రంగానే పంటలను సాగు చేశారు. రోజురోజుకు ప్రాజెక్టు నీటి పెరుగుతుండడంతో ఆధారపడిన రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటితో తాగునీటికి డోకా లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే పంటల సాగుకు మాత్రం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరితే నే, నీటిని వదిలేందుకు సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. వరద నీరు ఈ విధంగా కొనసాగితే పంటల సాగుకు ఢోకా ఉండదని రైతులు భరోసాను వ్యక్తం చేస్తున్నారు. (అధిక ముసురుతో పంటలకు నష్టం)

రూ.120 కోట్లతో 59 కిలో మీటర్ల కాలువల నిర్మాణం

సింగూర్ ప్రాజెక్టు నీటిని సాగుకు అందించాలన్న లక్ష్యంతో 2006 లో కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన నిధులు రూ.89.90 కోట్లను మంజూరు చేసింది. అప్పట్లో ఆందోల్ ఎమ్మెల్యే గా ఉన్న దామోదర్ రాజనర్సింహ చొరవతో దివంగత సీఎం రాజశేకర్ రెడ్డి కాలువల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో ఆందోల్, పుల్కల్ మండలాలోని 37500 ఎకరాలకు గాను ప్రధాన ఎడమ కాలువ 24 కిలో మీటర్లు, ఉప ప్రధాన కాలువ 23 కిలో మీటర్లు, సదాశివ పెట్, మునిపల్లి మండలాల్లో 2500 ఎకరాలకు గాను పన్నెండున్నార కిలో మీటర్ల కుడి కాలువను తీశారు. ఈ కాలువల పనులను పూర్తి చేసి, 2016 లో ట్రయల్ రన్ చేసి నీటిని వదిలారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మరో రూ.30 కోట్లను విడతల వారిగా కేటాయించింది. ఆయా మండలాలోని 126 చెరువులను కాలువల ద్వారా నింపడం తో మరో 8 వేల ఏకరాలకు సాగు నీరు అందుంతుంది. దీంతో ఈ ప్రాజెక్టు కింద నాలుగు మండలాల్లో 48 వెల ఎకరాల భూమి సాగుకు నోచుకుంటుంది.

రెండేళ్లుగా తప్పని సాగు కష్టాలు

సింగూర్ ప్రాజెక్టుపై ఆధారపడి సాగు చేస్తున్న రైతాంగానికి గత రెండేళ్లుగా గడ్డుకాలమే. ప్రాజెక్టులోని నీటిని ప్రభుత్వం అనధికారికంగా 15 టీఎంసీల నీటిని 2018లో వదిలారు. అప్పటి నుంచి ఇక్కడి ప్రాంత రైతులకు సాగు కష్టాలు తప్పలేదు. ఆందోల్, పుల్కల్, సదాశివపేట, మునిపల్లి మండలాల్లో 126 చెరువులు, 48 వేల ఏకరాల తో పాటు, ప్రతి ఏడాది 4 టీఎంసిలు ఘనపూర్, 8 టీఎంసీలు నిజాం సాగర్ కు నీటిని వదలాలన్న నిబంధన ఉంది. కానీ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో గత రెండేళ్ల లో ఘన పూర్ కు 2 టీఎంసీల నీటినే వదిలారు. నీటిని అక్రమంగా తరలించడంపై జిల్లాలోని నాలుగు మండలాల తో పాటు ఆయా ప్రాజెక్టుల పై ఆధారపడి సాగు చేస్తున్న రైతాంగానికి సాగు కష్టలు తప్పలేదు. ఈ సారి ప్రాజెక్టు లోకి కొంచెం, కొంచెం వరద నీరు వస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తుంది.

(వ్యాక్సిన్‌ వచ్చే వరకు బడులు లేనట్టే!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -