- జిల్లా వ్యవసాయాధికారి నర్సింహ్మరావు
అందోల్ః రైతులకు పంటల్లో ఏమైనా సందేహాలుంటే మండల వ్యవసాయ, విస్తరణ అధికారులను సంప్రదించి, సందేహాలను నివృత్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహ్మరావు సూచించారు. పంటల సాగు వివరాల తనిఖీలో భాగంగా గురువారం అందోలు మండల పరిధిలోని అందోల్, డాకూర్, అక్సాన్‌పల్లి, తాడ్మన్నూర్ గ్రామాలలో పర్యటించి, పలు రకాల పంటలను ఆయన పరిశీలించారు.
సింగూర్ డ్యాంలో దూకి వ్యక్తి ఆత్మహత్య
ఆయా గ్రామాల్లోని రైతులతో నేరుగా మాట్లాడి, పంటల సాగు వివరాలను, సాగు చేసే విధానాన్ని పరిశీలించారు. ఎరువులు సకాలంలో అందుతున్నాయా? ఏవో, ఏఈవోలు అందుబాటులో ఉంటున్నారా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటల సాగులో మెళుకువలు, చీడ పీడల నివారణకై వాడాల్సిన మందులు, పాటించాల్సిన పద్దతులను వ్యవసాయ ఆధికారులను అడిగి తెలుసుకొవాలన్నారు.
ఆన్‌లైన్ క్లాసులకు సెల్ ఫోన్ కొనలేదని..
అనంతరం అక్సాన్‌పల్లిలో నిర్మిస్తున్నరైతు వేధిక పనులను పరిశీలించి, నిర్మాణం పనలను నాణ్యతగా, త్వరిగతిన పూర్తి చేయాలని ఫోన్ ద్వారా కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆయనతో పాటు ఏడీఏ అరుణ, ఏవో సారిక, ఏఈవోలు శ్రీనివాస్, శ్రీకర్, యశస్వినీ, రెవంత్‌లు ఉన్నారు.
మత్య్సకారుల అభివృద్ధే లక్ష్యం..