end
=
Monday, March 31, 2025
వ్యవసాయంఅధిక ముసురుతో పంటలకు నష్టం
- Advertisment -

అధిక ముసురుతో పంటలకు నష్టం

- Advertisment -
- Advertisment -
  • రైతులకు పంటల జాగ్రత్త పై అవగాహన తప్పనిసరి
  • మెళకువలు పాటించకపోతే పంట నష్టం తప్పదు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు, వర్షాలకు వంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సీజన్ లో రైతులు నియంత్రిత సాగు విధానంలో పంటలను వేశారు. వరి, పత్తి, పప్పు దినుసులు, సొయా, కూరగాయల పంటలను ఎక్కువగా సాగు చేశారు. ముసురు కారణంగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పంటలకు సూర్యరశ్మి కొరత ఏర్పడింది. వాతావరణ సమతుల్యత ఏర్పడి పంటకు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయా పంటలపై రైతులు ఏమైనా సందేహాలు ఉంటే సూచనలను సలహాలను పాటించాలి అన్నారు.

వరి రైతుకు సూచనలు:

  • భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వర్షా ధార పంట పొలాల్లో నుంచి మురుగు నీటిని తీసివేయాలి.
  • ఈ నెలలో నాట్లు వేసే రైతులీజ్ మళ్లలో కార్బోఫ్యూర న్ 3జీ గుళికలను వరి నాట్లు వేసే వారం రోజుల ముందు చల్లు కోవాలి.
  • దోమ పోటు ఉదృతిని తగ్గించుకోవడానికి రెండు
  • మీటర్లకు 20 సెంటి మీటర్ల కాలిబాటలు వదులుకొని తూర్పు, పడమర దిశలో వరదలు ముందే ఎలా వేసుకోవాలి.
  • ప్రస్తుత పరిస్థితుల్లో వరిలో తాటాకు తెగులు కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది.
  • తాటాకు తెగులు నివారణకు రెండు మిల్లీ లీటర్ ప్రోఫినోఫాస్, లేదా 2.5 క్లోరోపైరిపాస్, మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
  • కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరాకు 10కి. కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు లేదా 4కి. ఫోరేట్ గుళికలు నాటిన 15-20 రోజుల తరువాత వేసుకోవాలి.
    పత్తి:
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో రసం పీల్చే పురుగు ఆశిస్తున్నాయి.
  • నివారణ కోసం ఇమిడా క్లోప్రిడ్ మందును నీటిలో 1:20నిష్పత్తి లో కలిపి మొక్క కాండంపై బ్రష్ తో రుద్దాలి.
  • భూమిలో తేమ ఉన్నందున పై పాటుగా ఎకరాకు 25 కిలోలు యూరియా, 10 కిలోల పొటాష్ వేయాలి.
  • అధికంగా వర్షాలు కురుస్తుండడంతో వడలు తెగులు సోకు టకు అనుకూలమైన వాతావరణం.
  • నివారణకు 3 గ్రాముల కాఫర్ ఆక్సిక్లోరైడ్ ను లీటర్ నీటిలో కలిపి మొదళ్లకు తడపాలి.

కంది:

కంది పంటకు పెనుబంక తెగులు ఆశిస్తున్నది. నివారణకు 1.6 మి. లీ. మోనోక్రోఫాస్, లేదా 1.5 గ్రాముల ఎసిఫెట్, 20 గ్రాముల యూరియా లేదా 5 గ్రాముల మల్టికేను లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి.

కూరగాయలు:

  • కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగులను గమనించి, 2 మిల్లి లీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఏసీఫెట్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
  • కూరగాయలు ఇంకా వేయని రైతులు నారుమళ్లు పోసుకోవాలి. టమాటా, వంకాయ, మిరప నారుమళ్లు పోసుకోవాలి. బెండ, చిక్కుడు, తిగజాతి కూరగాయలు విత్తు కోవాలి. నారు మళ్లలో మురుగు నీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలి.

సొయా:

  • సొయా చిక్కుడు పెంకు పురుగు ఆశించడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. దీని నివారణకు 1.25 మి. లీ. ట్రైజోఫాన్ మందును లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.
  • కాండం తొలుచు ఈగ ఆశిస్తే 1.5 గ్రాముల ఎసిఫెట్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

మొక్కజొన్న:

  • మొక్కజొన్న పంటను జిల్లాలోని కొన్ని మండలాల్లో సాగు చేయగా, కత్తెర పురుగు ఆశించినట్లుగా వ్యవసాయ అధికారులు గుర్తించారు.
  • మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణకు రైతులు విషపు ఎర తయారు చేసుకోవాలి.
  • 10 కిలోల తవుడులో 2 కిలోల బెల్లం కలిపి, 2 లేదా 3 లీటర్ల నీటిలో చేర్చాలి. రోజంతా పులియనిచ్చి, మరుసటి రోజు వంద గ్రాముల థైదికార్బ్ ను కలిపిన మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి మొక్క సుడుల్లో వేయాలి. లేదా ఇమా మేక్టన్ బెంజియేట్ 0.4 గ్రా. లేదా క్లోరోన్ ట్రీనిలిఫ్రోల్ 0.4 మి. లీ.నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -