end
=
Friday, September 20, 2024
వార్తలుజాతీయంMaharashtra:బల్లార్షా రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం
- Advertisment -

Maharashtra:బల్లార్షా రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం

- Advertisment -
- Advertisment -

  • ఒక్కసారిగా కుప్పకూలీన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి
  • 20 మందికి తీవ్రగాయాలు 8 మంది సీరియస్


మహారాష్ట్రలో(Maharashtra) విషాదం చోటు చేసుకుంది. నాగ్‌పూర్‌(Nagpur) సమీపంలోని బల్లార్షా రైల్వే స్టేషన్‌ (Railway station) లోలోని పురాతన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Railway foot over bridge) కుప్పకూలింది. కొంత భాగం కుప్పకూలిపోగా ఈ ఘటనలో 20 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.ఒక్కసారిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రీ కాస్ట్ స్టాబ్స్ (Bridge precast stabs) కుప్పకూలడంతో 13-15 మంది ప్రయాణికులు పట్టాలపై పడిపోయారు. ఆ సమయంలో ఆ ట్రాక్‌లపై రైలు నడవలేదు. కాగా,ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 60 అడుగుల ఎత్తులో ఉందని, ఇది చాలా పాతదని తెలుస్తోంది. ఇది ఒకటి, నాలుగు ప్లాట్‌ఫారమ్‌ (Four platforms)లను కలుపుతుంది. రైల్వే స్టేషన్లో ఒక ఫ్లాట్ ఫాం నుంచి వేరే ఫ్లాట్ ఫాంకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిపై నడుస్తుండగా.. ప్రమాదం జరగడంతో చాలా మంది ప్రయాణికులు దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి కిందికి జారిపడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది (Police and firemen)ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5.10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది రైల్వే స్టేషన్‌లోని ఒకటవ నెంబర్ ఫ్లాట్ ఫాం నుంచి 4వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సహాయక సిబ్బంది, అధికారులు హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యల్లో తోటి ప్రయాణికులు, ఐఆర్ సీటీసీ (IRCTC) సిబ్బంది పాల్గొన్నారు. అయితే, ప్రమాదం జరిగని సమయంలో రైళ్లు ఏవీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు రూ. లక్ష, గాయపడిన ప్రయాణికులకు రూ. 50 వేలు పరిహారాన్ని ప్రకటించింది రైల్వేశాఖ

(Covid:మళ్లీ విజృంభిస్తున్న కరోనా)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -