end

Beijing :ఘోర రోడ్డు ప్రమాదం -చైనాలో ట్రక్కు ఢీకొని 19 మంది మృతి

ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. కేవలం ఈ సమస్య ఏ ఒక్క దేశానికో కాదు ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్ల కారణంగా వేల సంఖ్యలో ప్రజలు చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ క్రమంలోనే తాజాగా చైనా (China)లో ఘోర రోడ్డు ప్రమాదం (road accident)చోటుచేసుకుంది.

జియాంగ్సీ ప్రావిన్సు (Jiangxi Province)లోని నాన్‌చంగ్ కౌంటీ (Nanchang County)లో ఆదివారం అంతిమయాత్రలో పాల్గొంటున్న వ్యక్తులపై ట్రక్కు (Truck) దూసుకొచ్చిన ఘటనలో 19 మంది మరణించారు. తుది వీడ్కోలు పలికేందుకు వేచి ఉన్న జనంపైకి ట్రక్కు దూసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 20 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు. దట్టమైన పొగమంచు కారణంగా ముందు ఏమున్నదో తెలియక ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. అయితే డ్రైవర్ (Driver) నిర్లక్ష్యం కారణమనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం తర్వాత అప్రమత్తమైన అధికారులు ఆ వైపుగా ప్రయాణించే వారికి ట్రావెల్ టిప్స్ (Travel Tips) జారీ చేశారు. వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కోరారు. వాహానాల మధ్య దూరం పాటించడంతో పాటు ఓవర్ టేక్ చేయవద్దని సూచించారు. ఇప్పటికే రూల్స్ అతిక్రమించినవారికి భారీ జరిమానా విధిస్తున్న కొంతమంది పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే విషయం.

(India:అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్!)

Exit mobile version