end

కన్న తండ్రి కర్కసం

  • సొంత కుమారుడి ఇంటికి నిప్పంటించిన కన్న తండ్రి
  • కాలిబూడదైన కొడుకు, కోడలు, మనుమరాళ్లు
  • కేరళలోని ఇడుక్కి జిల్లాలో దారుణం

సొంత కొడుకు కుటుంబాన్ని తగలబెట్టిన అతి దారుణమైన సంఘటన కేరళలో జరిగింది. భూ తగాదాల కారణంగా సొంత కొడుకు, కోడలు, మనుమరాళ్లు నిద్రిస్తున్న సమయంలో ఆ ఇంటికి పెట్రోలు పోసి నిప్పటించాడు. ఈ హృదయవిదారక ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లా తొడుపుళలోని చినీకుళిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. తండ్రి హమీద్‌ అనే వ్యక్తి స్థలం వివాదంలో కుమారుడు ఫైజల్‌పై కోపం, కక్ష పెంచుకొన్న అతను కుమారుడు కుటుంబం నిద్రిస్తున్న వేళ పెట్రోల్‌ బాటిళ్లను ఇంటిపై విసిరి నిప్పంటించాడు.

ఇళ్లు మొత్తం మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో కుమారుడు, కోడులు, ఇద్దరు మనుమరాళ్లు కాలిబూడదయ్యారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఇరుగుపొరుగు వారు ఎంత ప్రయత్నించినా వారిని కాపాడలేకపోయారు. మరో విషయం ఏంటంటే ట్యాంకులోని నీళ్లను ఆ తండ్రి ముందే ఖాళీ చేశాడు. పక్కనే ఉన్న బావి దగ్గర నుండి బకెట్‌, తాడు కూడా పడేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హమీద్‌ను అరెస్టు చేవారు.

Exit mobile version