end

Flowers:అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు, నైవేద్యాలు ఏమిటి?

అమ్మవారికి ఫలానా నైవేద్యాలే(Offerings) పెట్టాలనే నియమం ఏదీ లేదు. ప్రసిద్ధ ఆలయాల్లో(Temples) అనుసరిస్తున్న విధానాలు ఆయా ఆలయాలకు మాత్రమే పరిమితమైనవి. వాటిలో మనకు నచ్చిన పద్ధతిని అనుసరించవచ్చు. ఏ దోషమూ లేదు. సంప్రదాయంగా ఎవరే నైవేద్యాలు చేస్తున్నారో వాటినే అనుసరించవచ్చు. ప్రత్యేకించి చెప్పాలంటే పరమాన్నం(Bliss) నివేదన చేయడం మంచిది. పుష్పాల విషయానికి వస్తే… చామంతిక, వకుళ, చంపక, పాటలాబ్జ, పున్నాగ, జాతీ, కరవీర, రసాల వంటి అనేక రకాలైన పుష్పాలను(Flowers) చెప్పారు మనవాళ్లు. సాత్వికమైన కుసుమాలతో ప్రధానంగా అర్చన చేయాలి.

(చదవండి : మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?)

ఘాటైనా వాసన కల పువ్వులను పాటల కుసుమాలు అంటారు. గులాబీ(Rose) పువ్వులవంటి వాటితో అర్చించేటప్పుడు ముళ్లభాగం(Thorn part) తీసేసి ఆరాధించవచ్చు. పువ్వులే కాకుండా అమ్మవారికి పత్రాలతో కూడా అర్చన చేస్తారు. ముఖ్యంగా మరువం, దవనం, తులసి(Basil), మారేడు పత్రాలతో అమ్మను ఆరాధిస్తారు. దూర్వం అంటే గరిక(garika)తో మాత్రం దుర్గాదేవిని ఆరాధించకూడదు.

Exit mobile version