end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయందొరికిపోతామనే భయంతోనే..
- Advertisment -

దొరికిపోతామనే భయంతోనే..

- Advertisment -
- Advertisment -
  • దీక్షిత్‌ను హత్య చేసిన కిడ్నాపర్లు
  • వారిని కఠినంగా శిక్షిస్తాం.. ఎస్పీ

శోకాతప్త హృదయాలతో..

గత కొన్ని రోజులుగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో దీక్షిత్‌ రెడ్డి అనే బాలుడి కిడ్నాప్‌ గురించి వింటూనే ఉన్నాం. కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి, తక్షణమే రూ. 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని దీక్షిత్‌ తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. మహబూబాబాద్‌ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఓ గుట్టపై పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం, నిందితులు వాడిన టెక్నాటజీ ద్వారా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

నాయిని మృతి పార్టీకి తీరని లోటుః కేటీఆర్‌

తదనంతరం, మహాబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి బాలుడి కిడ్నాప్, హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతోనే వారు బాలుడిని కిడ్నాప్‌ చేశారనీ, బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారని తెలిసి, వెంటనే గుంతునులిమి హత్యచేశారని ఎస్పీ తెలిపారు.

అదిరిపోయిన రామరాజు ఫ్రమ్‌ భీమ్‌..

బాలుడ్ని చంపిన విషయం దాచిపెట్టి, డబ్బులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. నిందితులు ఇంటర్నెట్‌ కాల్స్‌ ఉపయోగించినా.. సైబర్‌ క్రైమ్‌ టాస్క్‌ఫోర్స్‌ సాయంతో నిందితులను పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. నిందితులు దీక్షిత్‌కు బంధువులైన మనోజ్‌ రెడ్డి, సాగర్‌లేననీ, వారే మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.

ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -