end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీPesticides:పువ్వులతో తేనెటీగల పరాగసంపర్కానికి ఎరువుల ఆటంకం
- Advertisment -

Pesticides:పువ్వులతో తేనెటీగల పరాగసంపర్కానికి ఎరువుల ఆటంకం

- Advertisment -
- Advertisment -


పాలినేటర్స్ (Pollinators) (పుష్పాల్లో పరాగసంపర్కాన్ని కలిగించే కీటకాలు).. పువ్వుల చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ (Electric field) మార్పులను గుర్తించగలవు. కాబట్టి అవి ఎరువులు లేదా పురుగుమందుల (fertilizers or pesticides)తో పిచికారీ చేయబడిన పువ్వుల (Flowers) పైకి వచ్చే అవకాశం తక్కువని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌ పరిశోధకుల అధ్యయనం (A study by University of Bristol researchers) లో వెల్లడైంది. పెస్టిసైడ్స్ లేదా ఫర్టిలైజర్స్ పిచికారీ చేయడం వల్ల పువ్వుల చుట్టూ ఉన్న విద్యుత్ క్షేత్రం 25 నిమిషాల పాటు మారిపోతుందని అధ్యయనంలో తేలింది. నిజానికి గాలి వల్ల కలిగే సహజ హెచ్చుతగ్గుల కంటే ఇది చాలా ఎక్కువ కాలం ఉంటుంది. కనుక ఇది ప్రకృతిలో తేనెటీగల ఫీడింగ్ (Feeding of bees)ప్రయత్నాలను ప్రభావితం చేస్తుంది.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఫర్టిలైజర్స్.. దృష్టి, వాసనను ప్రభావితం చేయవు. అయితే రసాయనాల వల్ల కలిగే చిన్న, డైనమిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజెస్‌ను గుర్తించి వాటికి దూరంగా ఉండటంలో తేనెటీగలు తెలివిగా వ్యవహరిస్తాయని ఈ అధ్యయనం పేర్కొంది. ‘పువ్వులు.. ఫీడింగ్, పరాగసంపర్కాన్ని (Pollination) ప్రోత్సహించేందుకు తేనెటీగలను ఆకర్షించగలవు. నిజానికి కూడా తేనెటీగలు పువ్వుల వాసన (Smell), రంగు (Colour)వంటి సూచనలకు అట్రాక్ట్ (Attract)అవుతాయి. కానీ అవి మొక్కలను గుర్తించేందుకు విద్యుత్ క్షేత్రాలను కూడా ఉపయోగిస్తాయి. అయితే వ్యవసాయ రసాయనాల (Agricultural chemicals) వినియోగం పూల సూచనలను వక్రీకరించి, తేనెటీగలు వంటి పరాగ సంపర్కాల్లో ప్రవర్తనను సవరించగలదు’ అని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎల్లార్డ్ (Dr. Ellard Hunting) హంటింగ్ తెలిపారు.

భూమిపై సంచరించే కీటకం విద్యుత్ జ్ఞానానికి అంతరాయం కలిగిస్తున్న మానవజనిత శబ్దానికి ఇది మొదటి ఉదాహరణ. ఈ పెస్టిసైడ్స్ వల్ల కలిగే శబ్దం మోటర్ బోట్ (Motor boat) లాంటిది. ఇది చేపల్లో ప్రిడేటర్స్‌ (Predators in fish)ను గుర్తించే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. పూలకు సంబంధించిన విద్యుత్ సూచనలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న తేనెటీగలకు ఎరువుల శబ్దమే మూలం. ఇక ఈ అధ్యయనం.. మానవ కార్యకలాపాలు నేచురల్ వరల్డ్‌ (Natural World)ను ప్రతికూలంగా ప్రభావితం చేసే అనేక మార్గాలపై మన అవగాహనను విస్తృతం చేస్తుంది. ఇది నిరుత్సాహంగా అనిపించవచ్చు. అయితే ఈ రసాయనాలు తేనెటీగలపై కలిగించే నెగెటివ్ ఎఫెక్ట్స్ (Negative effects)నివారించేందుకు పరిష్కార మార్గాలు కనిపెట్టడంలో ఇది సాయపడవచ్చు.

(Alcohol:ఆల్కహాల్‌తో స్టీమీ సెక్స్‌ సెషన్‌ నిజమేనా?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -