end
=
Sunday, January 19, 2025
సినీమాఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ హఠాన్మరణం
- Advertisment -

ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ హఠాన్మరణం

- Advertisment -
- Advertisment -

సిని పరిశ్రమలో మరో విషాదం. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, మూవీ ట్రాకర్ కౌశిక్ ఎల్ ఎం హఠాన్మరణం చెందారు. నిద్రలోనే ఆయన కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూసినట్లు తెలుస్తుంది. ఆయన వయస్సు 35 ఏళ్లు. 1987లో జన్మించిన కౌశిక్ ఎల్ ఎం సినిమా రివ్యూలు, తమిళనటుల ఇంటర్వ్యూలు చేయడంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు . యువ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ అర్థాంతరంగా తనువు చాలించడంతో సినీపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతా ద్వారా బాక్సాఫీస్ రిపోర్టులు, సినిమా అప్‌డేట్‌లను అందించడంలో కౌశిక్ పేరు పొందారు.

సీతారామం మూవీకి సంబంధించి చనిపోవడానికి 7 గంటల ముందు ఓ ట్వీట్ ను కూడా చేశారు. త్వరలో విడుదల కానున్న రోహిణి, కరుణాకరన్ నటించిన తమిళ చిత్రం జీవి 2 యొక్క ప్రెస్ మీట్‌కు కౌశిక్ హాజరు కావాల్సి ఉంది . అతను కార్యక్రమానికి రాకపోవడంతో, స్నేహితులు కౌశిక్ కు ఫోన్ చేసినా స్పందన రాలేదు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన కౌశిక్ ప్రముఖ తమిళ యూట్యూబ్ ఛానెల్ బిహైండ్‌వుడ్స్‌లో ఫిల్మ్ క్రిటిక్ గా వృత్తిని ప్రారంభించాడు. ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ఇచ్చే కౌశిక్ ఇక లేరన్న వార్త ఆయన ఫాలోవర్స్ ను షాక్ కు గురిచేసింది. తాను మాట్లాడే విధానానికి ఎంతో మంది ముగ్దులయ్యేవారు. ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకర్, ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబ్ వీడియో జాకీ, ఫిల్మ్ రివ్యూయర్, క్రికెట్ & టెన్నిస్ బఫ్‌గా కౌశిక్ గుర్తింపు పొందారు. మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తోటి సినిమా ట్రాకర్లు, థియేటర్ యజమానులు, ప్రముఖులు మరియు సినీ సమీక్షకులు కౌశిక్ మృతికి సంతాపం తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -